Skip to main content

France bans Islamic attire Abaya: ఫ్రాన్స్ స్కూళ్లలో బుర్ఖా నిషేధం

ఫ్రాన్స్ స్కూళ్లలో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ)లను నిషేధించనున్నారు.
 France bans Islamic attire Abaya
France bans Islamic attire Abaya

పాఠశాలల్లో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు స్కూళ్ల ఉన్నతాధికారులకు విధి విధానాలను తెలియజేస్తామని చెప్పారు.
'లౌకికవాదం మొదట పాఠశాలలోనే తెలుసుకోవాల్సిన విధానం. బుర్ఖా(అబయ)లు మతపరమైన గుర్తును కలిగి ఉన్నాయి. దీనివల్ల ఫ్రాన్స్‌ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతుంది. తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతో మతం ఎంటో చెప్పేలా ఉండకూడదు.' అని గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే ఎలాంటి దుస్తులను ధరించకూడదని పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు.       
పాఠశాలల్లో బుర్ఖా(అబయ) ధరించే సాంప్రదాయం క్రమంగా పేరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలకు ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. 

Grand Cross of the Order of Honour: మోదీకి గ్రీసు ప్రతిష్టాత్మక ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ హానర్‌’ ప్రదానం

పాఠశాలల్లో ఇస్లామిక్ బుర్ఖా(అబయ)లను నిషేధించాలనే వాదనలు ఫ్రాన్స్‌లో కొద్దిరోజులుగా తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. వామపక్షవాదులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముస్లిం సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Fukushima Released Radioactive water: ఫ్యుకుషిమా జపాన్‌ అణు జలాల సముద్రంలోకి విడుదల

మతపరమైన గుర్తులంటే కేవలం వేషధారణ మాత్రమే కాదని అంటున్నాయి. ఇతర వస్తువులు కూడా మతపరమైన గుర్తులను సూచిస్తాయని చెబుతున్నాయి. కానీ ప్రతిపక్ష రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ అధినేత ఎరిక్ సియోట్టో ప్రభుత్వ విధానాలకు స్వాగతం పలికారు. 

BRICS Summit 2023: బ్రిక్స్‌ కూటమిలోకి మరో ఆరు దేశాలు

Published date : 28 Aug 2023 05:25PM

Photo Stories