Skip to main content

మలబార్‌ విన్యాసాలు - 2021 ఎక్కడ ప్రారంభమయ్యాయి?

అమెరికాలోని గువామ్‌ తీరం(పసిఫిక్‌ మహాసముద్రం)లో ఆగస్టు 22న మలబార్‌ యుద్ధ విన్యాసాలు-2021 ప్రారంభమయ్యాయి.
ఆగస్టు 29వ తేదీ వరకు జరగనున్న ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ శివాలిక్, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ యుద్ధ నౌకలు విశాఖ తీరం నుంచి బయలుదేరి వెళ్లాయి. అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ జాన్‌ మెక్‌కైన్, హెచ్‌ఎంఏఎస్‌ బలారత్, జపాన్‌కు చెందిన జేఎస్‌ ఒనామీతోపాటు రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీకి చెందిన యుద్ధ నౌకలు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.

26 నుంచి సీఫేజ్‌ విన్యాసాలు...
ప్రధానమైన సీఫేజ్‌ విన్యాసాలు ఆగస్టు 26 నుంచి 29 వరకు జరగనున్నాయి. వీటికి భారత్‌ తరఫున ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ కమాండింగ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ రియర్‌ అడ్మిరల్‌ తరుణ్‌ సోబ్తి హాజరవుతారు. సీఫేజ్‌లో భాగంగా యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ ఆపరేషన్స్, క్రాస్‌డెక్‌ ల్యాండింగ్స్, సీమ్యాన్‌ షిప్‌ విన్యాసాలు నిర్వహించనున్నారు.

1992లో ప్రారంభం...
ఇండోపసిఫిక్‌ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో మలబార్‌ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాలను భారత్‌అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992లో ప్రారంభించాయి. తర్వాత కాలంలో జపాన్‌ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటుంది. తాజాగా రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ చేరడంతో.. ఈ సంఖ్య నాలుగుకు చేరింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : మలబార్‌ యుద్ధ విన్యాసాలు2021 ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
ఎక్కడ : అమెరికాలోని గువామ్‌ తీరం(పసిఫిక్‌ మహాసముద్రం)
ఎందుకు : ఇండోపసిఫిక్‌ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో...
Published date : 14 Oct 2021 06:34PM

Photo Stories