Skip to main content

Expo 2020: మధ్యప్రాచ్యంలో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌?

Dubai Expo-2020

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌లోని దుబాయ్‌లో దుబాయ్‌ ఎక్స్‌పో–2020(వరల్డ్‌ ఫెయిర్‌–అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌) ప్రారంభమైంది. ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా కనిపించిన ప్రదేశం ఇప్పుడు ప్రపంచంలోని నలుమూలల ఉన్న అద్భుతాల నమూనాలకు వేదికైంది. 2021, అక్టోబర్‌ 1న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్‌ 2022, మార్చి 31 వరకు జరగనుంది. ఎనిమిదేళ్ల పాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ఎగ్జిబిషన్‌లో భారత్‌తో సహా మొత్తం 190 దేశాలకు సంబంధించిన పెవిలియన్స్‌ (విభాగాలు) ఉన్నాయి. మొత్తం 192 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌గా ఇది రికార్డులకెక్కింది. ఇప్పటి వరకూ అమెరికా, యూరోప్‌ తప్ప మధ్యప్రాచ్యంలో ఎప్పుడూ ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహించలేదు.

దుబాయ్‌ ఎక్స్‌పో 2020 – విశేషాలు...

  • వాస్తవానికి 2020 ఏడాది ప్రారంభం కావల్సిన ఈ ఎగ్జిబిషన్‌.. కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. 2021లో ప్రారంభమైనా... మార్కెటింగ్, బ్రాండింగ్, ఇతర కారణాల వల్ల దుబాయ్‌ ఎక్స్‌పో 2020గానే పరిగణిస్తున్నారు.
  • మొత్తం 1080 ఎకరాల్లో నిర్మించిన ఈ ఎగ్జిబిషన్‌ దాదాపు ఆర్నెళ్ల పాటు దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించనుంది.
  • స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రెప్లికా, అమెరికా మూడో అధ్యక్షుడు వాడిన ఖురాన్, ట్రాన్స్‌ఫార్మర్‌లా మారే చైనా కారు, 20 లక్షల ప్లాస్టిక్‌ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల ఇటలీ తాడు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్‌ హీరో డేవిడ్‌ త్రీడీ బొమ్మ వంటివి ఇందులో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
  • భవిష్యత్తులో చూడబోయే టెక్నాలజీల ప్రొటోటైప్‌లు కూడా ఎగ్జిబిషన్‌లో ఉండనున్నాయి.

దుబాయ్‌ ఎక్స్‌పో 2020...

మోటో(Motto): కనెక్టింగ్‌ మైండ్స్, క్రియేటింగ్‌ ద ఫ్యూచర్‌
మేనిజింగ్‌ డైరెక్టర్‌: రీమ్‌ అల్‌ హషేమి
మస్కట్‌(Mascot): సలమా, రషీద్, లతిఫా, అలీఫ్, ఓప్టి, టెర్రా

 

ఒసాకాలో ఎక్స్‌పో 2025...

1851లో తొలిసారిగా లండన్‌లో  ప్రారంభమైన ఈ విధమైన ఎగ్జిబిషన్‌లు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ప్రతినిధుల కలయిక, అభిప్రాయాలు పంచుకోవడం, ఆవిష్కరణల ప్రదర్శన, సంస్కృతి, వాణిజ్యాన్ని పెంపొదించుకునేందుకు దోహదపడుతున్నాయి. మనిషి అద్భుత ఆవిష్కరణలు, ఆలోచనలు, ఊహాజనిత అంశాలకు వేదికగా మారాయి. వరల్డ్‌ ఎక్స్‌పో–2015కు ఇటలీలోని మిలాన్‌ నగరం వేదిక కాగా, ఎక్స్‌పో–2025కు జపాన్‌లోని ఒసాక నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.

చ‌ద‌వండి: కొవాగ్జ్‌ కార్యక్రమం ఏ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతోంది?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దుబాయ్‌ ఎక్స్‌పో–2020(వరల్డ్‌ ఫెయిర్‌–అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌) ప్రారంభం
ఎప్పుడు  : అక్టోబర్‌ 1
ఎవరు    : యూఏఈ ప్రభుత్వం
ఎక్కడ    : దుబాయ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్, దుబాయ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ)   
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ప్రతినిధుల కలయిక, అభిప్రాయాలు పంచుకోవడం, ఆవిష్కరణల ప్రదర్శన, సంస్కృతి, వాణిజ్యాన్ని పెంపొదించుకునేందుకు...

 

Published date : 02 Oct 2021 01:38PM

Photo Stories