World Trade Organization: డబ్ల్యూటీవో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
కరోనా మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వర్ధమాన దేశాలు అమలు చేసిన వాణిజ్య చర్యలను అభివృద్ధి చెందిన దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) వివాద పరిష్కార ప్యానెల్ ముందుకు తీసుకెళ్లరాదంటూ భారత్, క్యూబా, ఆఫ్రికా యూనియన్ కోరాయి. ఈ మేరకు ఒక కాన్సెప్ట్ పేపర్‌ను డబ్ల్యూటీవోకు సమర్పించాయి. ట్రేడ్ చర్యలపై విరామం, మేధో సంపత్తి హక్కుల పరంగా వెసులుబాటు అన్నది కరోనా సంక్షోభం వరకు తాత్కాలికంగా కొనసాగించాలని కొరాయి. డబ్ల్యూటీవో ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవా నగరం ఉంది.
శ్రీలంక కరెన్సీ పేరు?
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. నిధుల లేమితో దేశ అవసరాలకు తగ్గ ఇంధనం దిగుమతి చేసుకోలేక ప్రభుత్వం చేతులెత్తింది. దీంతో దేశమంతా విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 22న దేశ పవర్ గ్రిడ్‌ను రెండుగంటలు నిలిపివేస్తున్నట్లు శ్రీలంక ప్రజావసరాల కమిషన్ ప్రకటించింది. ఒకపక్క విద్యుత్ సంక్షోభం కొనసాగుతున్న వేళ డ్యాముల్లో నీటి నిల్వలు తగ్గడంతో జలవిద్యుదుత్పత్తి తగ్గింది.
శ్రీలంక..
శాసన రాజధాని: శ్రీ జయవర్ధనేపుర కొట్టే
కార్యనిర్వహక, న్యాయ రాజధాని: కొలంబొ
కరెన్సీ: శ్రీలంకన్ రూపీ
ప్రస్తుత అధ్యక్షుడు: గోటబాయ రాజపక్స
ప్రస్తుత ప్రధానమంత్రి: మహింద రాజపక్స
ప్రధాని మోదీతో చర్చలకు సిద్ధం: ఇమ్రాన్
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని మోదీతో టీవీ చర్చలో పాల్గొనేందుకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. రష్యా పర్యటనలో భాగంగా ఆర్‌టీ టెలివిజన్ నెట్‌వర్క్‌కు ఆయన ఫిబ్రవరి 22న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘మోదీతో టీవీలో చర్చకు ఇష్టపడతాను’అని వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాల అనంతరం తొలిసారి పాక్ ప్రధాని రష్యాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య విబేధాలు చర్చలతో పరిష్కారమైతే భారత ఉపఖండంలోని కోట్లాదిమంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
చదవండి: ఉక్రెయిన్‌లోని ఏ ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు రష్యా ప్రకటించింది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్