2021 COP26 Summit: కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది?
గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపై... యునైటెడ్ కింగడమ్‌లో భాగమైన స్కాట్‌లాండ్‌లో ఉన్న గ్లాస్గో నగరంలో కాప్ –26 సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు-2021) అక్టోబర్ 31న ప్రారంభమైంది. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొనే ఈ సదస్సు నవంబర్ 12 వరకు కొనసాగనుంది. ఇటలీ సహకారంతో యునైటెడ్ కింగ్‌డమ్ ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తోంది.
అలోక్ శర్మ నేతృత్వంలో...
భారత సంతతి వ్యక్తి, బ్రిటన్ కేబినెట్ మంత్రి, అలోక్ శర్మ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాప్ –26కి అధ్యక్షత వహిస్తున్నారు. సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ఆయన.. పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడమే మార్గమని చెప్పారు. భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడమే మన ముందున్న లక్ష్యమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
చదవండి: జి–20 దేశాల 16వ శిఖరాగ్ర సమావేశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాప్ –26 సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు-2021) ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : కాప్ –26 అధ్యక్షుడు అలోక్ శర్మ
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్