Military Exercise: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ సైనిక విన్యాసాలు
Telugu Current Affairs - International: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. సైనిక విన్యాసాలు మే 19న ప్రారంభమయ్యాయని, మే 23వ తేదీ వరకు కొనసాగుతాయని హైనన్ ప్రావిన్స్‌లోని చైనా మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ప్రకటించింది. విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియాపర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
Palm Oil Exports: పామాయిల్ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
GK Persons Quiz: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్?
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఏ దేశాలలో పర్యటిస్తున్నారు?
US President Joe Biden Begins Asia Tour: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మే 20న ఆసియా పర్యటన ప్రారంభించారు. దక్షిణ కొరియా, జపాన్‌లలో వారం రోజులు పర్యటించనున్న ఆయన తొలుత దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌టెక్‌కు వచ్చారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి బైడెన్ తన అభినందనలు తెలియజేశారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలోనే ప్రపంచ భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.
Pollution: అత్యధిక కాలుష్య మరణాలు ఏ దేశంలో సంభవించాయి?
NATO: నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?
ఏ దేశాధ్యక్షుడు శామ్‌సంగ్ చిప్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు?
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్ కంప్యూటర్ చిప్ తయారీ కేంద్రాన్ని(ప్యాంగ్‌టెక్‌లో ఉంది) బైడెన్ సందర్శించారు. ఈ కంపెనీ అమెరికాలోని టెక్సాస్‌లో 1500 కోట్ల అమెరికా డాలర్ల వ్యయంతో ఒక సెమి కండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వేధిస్తున్న కంప్యూటర్ చిప్‌ల కొరతను అధిగమించడం కోసమే బైడెన్ తన పర్యటనలో శామ్‌సంగ్ కంపెనీ సందర్శనకు పెద్దపీట వేశారు. సాంకేతికంగా చైనాపై ఆధారపడడం తగ్గించడం కోసమే ఆయన కొరియా, జపాన్‌లలో పర్యటించనున్నారు.
GK Sports Quiz: FIFA వరల్డ్ కప్ 2022 ను స్పాన్సర్ చేసిన మొదటి భారతీయ కంపెనీ?
Weather Station: ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ఏ దేశంలో ఏర్పాటైంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్