Weather Station: ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ఏ దేశంలో ఏర్పాటైంది?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో వాతావరణ కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసింది. మే 4న ఎవరెస్ట్ శిఖరంపై.. సముద్ర మట్టానికి 8,830 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ వాతావరణ కేంద్రంలో ఉపగ్రహ వ్యవస్థతోపాటు.. డేటా ట్రాన్స్‌మిషన్ కేంద్రం కూడా ఉంది. గతంలో అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు 8,430 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ దక్షిణ భాగాన నిర్మించిన వాతావరణ కేంద్రమే.. అత్యంత ఎల్తైనది. ఆ రికార్డును ఇప్పుడు చైనా అధిగమించింది.
GK Persons Quiz: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్?
Palm Oil Exports: పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ఏ దేశంలో ఏర్పాటైంది?
ఎప్పుడు : మే 04
ఎవరు : చైనా
ఎక్కడ : ఎవరెస్ట్ శిఖరం(చైనా వైపు)
ఎందుకు : వాతావరణంపై అధ్యయనం చేసేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్