Skip to main content

Anti Vaccine Protest: ఏ దేశ ప్రధానిని రహస్య ప్రదేశంలోకి తరలించారు?

Canadian PM Trudeau Family

కెనడా రాజధాని నగరం ఒట్టోవాలోని అధికారిక నివాసం నుంచి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఆయన కుటుంబాన్ని భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించాయి. దేశంలో కరోనా టీకా తప్పనిసరి నిబంధనలు, ప్రజారోగ్య నిబంధనలను వ్యతిరేకించే నిరసనకారులు భారీగా రాజధాని ఒట్టోవాకు చేరుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అధికారులు ప్రధానిని, ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి పంపారు. ‘‘ఫ్రీడం కాన్వాయ్‌’’ పేరిట జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా పలువురు ట్రక్కు డ్రైవర్లు భారీ ట్రక్కులతో రాజధానికి ర్యాలీగా బయలుదేరారు. వీరంతా జనవరి 29న భారీ సంఖ్యలో రాజధానికి చేరారు.

సరిహద్దుల నుంచి దేశంలోకి వచ్చే ట్రక్కు డ్రైవర్లకు తప్పక టీకా సర్టిఫికెట్‌ ఉండాలని కెనెడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పలువురు ట్రక్కు డ్రైవర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా నిబంధనలను వ్యతిరేకించేవారు ఈ ట్రక్కర్లకు మద్దతునిస్తున్నారు.

కెనడా..
రాజధాని:
ఒట్టోవా; కరెన్సీ: కెనడియన్‌ డాలర్‌
అధికార భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్‌
ప్రస్తుత ప్రధానమంత్రి: జస్టిన్‌ ట్రూడో

చ‌ద‌వండి: పెగసస్‌ స్పైవేర్‌పై కథనం ప్రచురించిన అమెరికన్‌ పత్రిక?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలింపు 
ఎప్పుడు : జనవరి 29
ఎవరు    : కెనడా భద్రతా బలగాలు
ఎందుకు : టీకా టీకా తప్పనిసరి నిబంధనలు, ప్రజారోగ్య నిబంధనలను వ్యతిరేకించే నిరసనకారులు భారీగా దేశ రాజధాని ఒట్టోవాకు చేరుతున్న నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 31 Jan 2022 04:32PM

Photo Stories