Skip to main content

Leap Year 2024: ఫిబ్రవరి 29..లీపు సంవత్సరం అని ఎందుకు అంటారు? ముఖ్యమైన ఘట్టాలివే..

Leap Year 2024 Things To Know About Leap Day   Gregorian calendar

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 29 సంవత్సరంలో 60వ రోజు. సంవత్సరాంతానికి ఇంకా 305 రోజులు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 29వ తేదీన దేశ, ప్రపంచ చరిత్రలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29న పుట్టిన వారు ప్రతి సంవత్సరం తమ పుట్టినరోజును జరుపుకోలేరు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తమ పుట్టినరోజును జరుపుకోగలుగుతారు. 

ఫిబ్రవరిలో 29 రోజులు ఉండే సంవత్సరాన్ని లీపు సంవత్సరం అని అంటారు. ఈ రోజు (ఫిబ్రవరి 29) భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ జన్మించారు. ఇలా ఫిబ్రవరి 29న చోటు చేసుకున్న ప్రముఖ ఘట్టాలను  ఒకసారి చూద్దాం. 

ఫిబ్రవరి 29.. కొన్ని ముఖ్యమైన ఘటనలు

1504: క్రిస్టోఫర్ కొలంబస్ తన పశ్చిమ యాత్రలో జమైకాలో చిక్కుకుపోయాడు. స్థానికులను చంద్రగ్రహణం పేరుతో భయపెట్టి, తన బృందానికి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు.

1796: బ్రిటన్‌తో పాత వివాదాలకు స్వస్తి పలికిన జే ఒప్పందాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు.

1856: రష్యా- టర్కియే మధ్య యుద్ధ విరమణ ప్రకటన

2000 - రష్యన్ దళాలు చెచ్న్యాలో 99 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రువాండా ప్రధాని పియర్ సెలెస్టిన్ రివిగేమా తన పదవికి రాజీనామా చేశారు.

2004 - ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యాత్రికుడు మిచెల్ అలెగ్జాండర్ కల్లెరి అంతరిక్షంలో కాలు మోపారు. అయితే అతని స్పేస్ సూట్‌లోని లోపం కారణంగా స్టేషన్‌కి తిరిగి వచ్చాడు.

2004: ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ చలనచిత్రం అకాడమీ అవార్డ్స్‌లో 11 అవార్డులను గెలుచుకుంది. ఇది మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

2008 - ప్రసిద్ధ సాహిత్యవేత్త డాక్టర్ బచ్చన్ సింగ్‌కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

2008 - భారత సంతతికి చెందిన రిచా గంగోపాధ్యాయ 26వ అందాల పోటీలో మిస్ ఇండియా యూఎస్‌ఏ-2007 టైటిల్‌ను గెలుచుకుంది.

ఫిబ్రవరి 29న పుట్టిన ప్రముఖులు

1932 – సిఎస్ శేషాద్రి (భారతదేశ ప్రముఖ గణిత శాస్త్రవేత్త)
1904 - రుక్మిణీ దేవి అరుండేల్ (ప్రముఖ భరతనాట్య నర్తకి)
1812 - టాస్మానియా నాయకుడు విల్సన్ కన్నుమూత.
1896 - మొరార్జీ దేశాయ్  (భారతదేశ మొదటి కాంగ్రెసేతర ప్రధాని)

ఫిబ్రవరి 29న కన్నుమూసినవారు
1880 - సర్ జేమ్స్ విల్సన్ (టాస్మానియన్ రాజకీయ నేత)
1952 – కుష్వాహా కాంత్  (భారతదేశ ప్రసిద్ధ నవలా రచయిత)

ఫిబ్రవరి 29 ముఖ్యమైన సందర్భాలు 
జాతీయ డీ అడిక్షన్ డే (మొరార్జీ దేశాయ్ పుట్టినరోజు)

Published date : 29 Feb 2024 11:51AM

Photo Stories