Sachivalayam Employees: అనూహ్య స్పందన... భారీగా బదిలీలకు దరఖాస్తులు
2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.
☛ AP Grama/Ward Sachivalayam : ఈ మార్కుల ఆధారంగానే.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు..
వీరికి ప్రభుత్వం ఈ ఏడాది బదిలీలకు అవకాశం కల్పించింది. బదిలీలకు ఈ నెల 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా పరిధిలో, అంతర్ జిల్లాల బదిలీలకు కలిపి మొత్తం 15,526 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. మంగళవారం రాత్రికల్లా జిల్లాల వారీగా, వివిధ కేటగిరీ పోస్టుల ప్రకారం బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ర్యాంకులు ఇస్తామని గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు వెల్లడించారు. బదిలీలకు అర్హత ఉన్న వారికి 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న మేరకు కేటాయించే సచివాలయాల వివరాలతో ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల్లోనే
అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 1,581 మంది బదిలీ కోరుతూ దరఖాస్తు చేశారు. ప్రత్యేకించి ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 233 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి 232 మంది దరఖాస్తు చేసినట్లు అధికారులు వివరించారు. అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు 1,976 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోరుతూ అత్యధికంగా మహిళా పోలీసులు 389 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఎక్కువ మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్టేటివ్ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకుంటారు. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి.
గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు రూ.22,120 - రూ.74,770పే స్కేలును అమలు చేయనున్నారు. డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రేడ్-2 అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వీఆర్వో, వెల్ఫేర్ అసిస్టెంట్ల వేతన శ్రేణి రూ.22,460 - రూ.72,810 మధ్య ఉండనుంది.
Good news: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.... త్వరలోనే రెగ్యులర్ చేసేందుకు చర్యలు... ఎవరు అర్హులంటే
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి ఉద్యోగులకు రూ.23,120 - రూ.74,770 వేతనం చెల్లించగా.. మిగిలిన వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్-డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీలకు పే స్కేలు రూ. 22,460- రూ.72,810 మధ్య ఉండనుంది.
చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా గుడ్‌న్యూస్‌లు...