Good news: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.... త్వరలోనే రెగ్యులర్ చేసేందుకు చర్యలు... ఎవరు అర్హులంటే
వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల బదిలీలకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా గుడ్‌న్యూస్‌లు...
తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం తియ్యని కబురును అందజేసింది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల
ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. డీఏ, పీఆర్సీ బకాయిలు 4ఏళ్లలో 16 వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. జీపీఎస్‌లోనే మెరుగైన అంశాలు చేర్చి అమలు చేస్తామని చెప్పారు. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై కేబినెట్ భేటీలో నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు.