Skip to main content

WPI Inflation: మైనస్‌లోనే ద్రవ్యోల్బణం

టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా అయిదో నెల కూడా మైనస్‌లోనే కొనసాగింది.
WPI inflation
WPI inflation

ఆగస్టులో మైనస్‌ 0.52%గా నమోదయ్యింది. సూచీలో పెరుగుదల లేకపోవడాన్ని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. టోకు బాస్కెట్‌ ధర పెరక్కపోగా..  మైనస్‌లో ఉన్పప్పటికీ, ఇందులో ఒక భాగంగా ఉన్న ఆహార బాస్కెట్‌ ధర మాత్రం తీవ్రంగా ఉంది.

Retail Inflation: దిగొచ్చిన ద్రవ్యోల్బణం

ఫుడ్‌ బాస్కెట్‌ తీరిది...

ఫుడ్‌ బాస్కెట్‌ ధరల పెరుగుదల ఆగస్టులో 10.6 శాతంగా (2022 ఆగస్టుతో పోల్చి) ఉంది. జూలైతో (14.25 శాతం) పోలి్చతే ధరల స్పీడ్‌ కొంత తగ్గడం ఊరటనిచ్చే అంశం. ఒక్క కూరగాయల ధరలు చూస్తే, 48.69 శాతం పెరుగుదల నమోదయ్యింది. జూలైలో ఈ పెరుగుదల రేటు ఏకంగా 62.12 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరల స్పీడ్‌ 10.45 శాతంకాగా, ఉల్లి ధరల విషయంలో ఈ రేటు 31.42 శాతంగా ఉంది. ధరల స్పీడ్‌ జూలైతో పోల్చితే తగ్గినప్పటికీ వార్షికంగా చూస్తే, ఇది చాలా ఎక్కువ పెరుగదలేనని నిపుణులు పేర్కొంటున్నారు.  

GST on Online Games, Casinos: ఇక‌పై ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోలకు 28 శాతం జీఎస్‌టీ

తయారీ: సూచీలో మెజారిటీ వాటా కలిగిన  తయారీ రంగంలో జూలైలో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్‌ 2.51 శాతం ఉంటే, ఆగస్టులో మైనస్‌ 2.37 శాతంగా నమోదయ్యింది.  
ఇంధనం–విద్యుత్‌: ఈ రంగంలో జూలైలో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్‌ 12.79 శాతం ఉంటే, ఆగస్టులో మైనస్‌ 6.03 శాతంగా ఉంది.

India 3rd Largest Economy by 2027: ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

 

Published date : 16 Sep 2023 12:34PM

Photo Stories