Gujarat: గ్రీన్ ఎనర్జీపై రూ. 6 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న సంస్థ?
గ్రీన్ ఎనర్జీ, ఇతర ప్రాజెక్టుల కోసం గుజరాత్‌లో వచ్చే 10–15 ఏళ్లలో రూ.5.95 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. పర్యావరణ అనుకూల ఇంధనాల వ్యాపారం కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ గిగా ఫ్యాక్టరీల ఏర్పాటుకు గుజరాత్‌ను ఎంపిక చేసుకుంది.
గుజరాత్ ప్రభుత్వంతో ఎంవోయూ..
వైబ్రంట్ గుజరాత్ సదస్సు 2022 సదస్సులో భాగంగా రూ.5.95 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు గుజరాత్ సర్కారుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. 100 గిగావాట్ల రెన్యువబుల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం గుజరాత్ ప్రభుత్వంతో కలసి కచ్, బనస్కాంత, ధొలెరా ప్రాంతాల్లో భూమిని గుర్తించేందుకు పనిని ప్రారంభించామని వెల్లడించింది. కచ్ జిల్లాలో 4.5 లక్షల ఎకరాలను కోరుతున్నట్టు తెలిపింది.
చదవండి: ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం.. 2022లో ప్రపంచ వృద్ధి రేటు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వచ్చే 10–15 ఏళ్లలో రూ.5.95 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న సంస్థ?
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎక్కడ : గుజరాత్
ఎందుకు : గ్రీన్ ఎనర్జీ, ఇతర ప్రాజెక్టుల కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్