Global Economy: ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం.. 2022లో ప్రపంచ వృద్ధి రేటు?
భారత్ ఆర్థిక రికవరీ ఇంకా విస్తృత స్థాయిలో లేదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో మార్చితో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంటుందన్న తమ గత అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్‌పై జనవరి 12న విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- భారత్ వృద్ధి రేటు 2022–23 ఏడాదిలో 8.7 శాతంగా, 2023–24లో 6.8 శాతంగా నమోదుకావచ్చు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేకించి తయారీ, మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథకం ప్రయోజనాలు, సంస్థాగత సంస్కరణలు వంటి అంశాలు తాజా అంచనాలకు కారణం.
- దక్షిణాసియాలో కరోనా సవాళ్లకు తోడు వినియోగ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ బ్యాంకుల లక్ష్యాలకన్నా ఇది తీవ్రంగా పెరుగుతోంది.
- ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2021లో 5.5 శాతంగా ఉంటే.. ఇది 2022లో 4.1 శాతానికి, 2023లో 3.2 శాతానికి తగ్గే అవకాశముంది. ప్రపంచ వ్యాప్తంగా సరళతర ఆర్థిక విధానాలు వెనక్కు తీసుకోవడం, డిమాండ్ వ్యత్యాసాలు దీనికి ప్రధాన కారణం.
యూబీఎస్ అంచనాలు 9.1 శాతానికి కోత
భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను స్విస్ బ్రోకరేజ్ దిగ్గజం– యూబీఎస్ సెక్యూరిటీస్ 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో అంచనాలు 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గాయి.
చదవండి: మినీ రత్న హోదా పొందిన ఇంజనీరింగ్ కంపెనీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 8.3 శాతంగా నమోదు కావచ్చు.
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : ప్రపంచ బ్యాంక్
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : తయారీ, మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, పీఎల్‌ఐ పథకం ప్రయోజనాలు, సంస్థాగత సంస్కరణలు వంటి అంశాల కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్