Skip to main content

Retail inflation: అక్టోబర్‌లో మరింత తగ్గిన‌ ద్రవ్యోల్బణం

రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్‌లోనూ మరింత తగ్గింది.
India's retail inflation eases to 4.87% in October

తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్‌ నెలతో పోల్చి) నమోదయ్యింది. అంతక్రితం నాలుగు నెలల్లో (జూన్‌లో 4.81 శాతం) ఇంత తక్కువ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.

Net Direct Tax Collection: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 22 శాతం వృద్ది

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 ప్లస్‌ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్‌ బ్యాంక్‌కు కేంద్రం నిర్దేశం. సెపె్టంబర్, అక్టోబర్‌లలో ఆర్‌బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్‌బీఐ అంచనా.

GST collections in October: రికార్డ్‌ స్థాయిలో అక్టోబర్‌ జీఎస్టీ వసూళ్లు

 

Published date : 14 Nov 2023 01:17PM

Photo Stories