India's external debt: భారత్ విదేశీ రుణ భారం ఎంతంటే?
Sakshi Education
భారత్ విదేశీ రుణ భారం 2023 మార్చితో ముగిసిన సంవత్సరానికి 624.7 బిలియన్ డాలర్లకు చేరింది.
2022 మార్చితో పోల్చితే 5.6 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. కాగా, ఇదే కాలంలో స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) విలువలతో పోల్చితే రుణ నిష్పత్తి తగ్గడం గమనార్హం.
2021–22 ఆర్థిక సంవత్సరం జీడీపీలో రుణ నిష్పత్తి 20 శాతం ఉంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ నిష్పత్తి 18.9 శాతానికి తగ్గింది. డాలర్–రూపీ విలువల్లో అలాగే యన్, ఎస్‌డీఆర్, యూరో–రూపీ విలువల్లో వ్యత్యాసాల వల్ల భారత్‌కు 2023 మార్చి నాటికి రుణ భారం 20.6 బిలియన్ డాలర్లు తగ్గింది. ఈ పరిస్థితి లేకపోతే భారత్ రుణ భారం ఈ కాలంలో 5.6 బిలియన్ డాలర్లు కాకుండా, 26.2 బిలియన్ డాలర్లుగా నమోదై ఉండేది.
☛ Fiscal Deficit: మే నాటికి ద్రవ్యలోటు 11.8 శాతం
Published date : 01 Jul 2023 05:20PM