High Inflation countries: అధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశాలు ఇవే..
పేద, ధనిక, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలనే తేడా లేదు. ఏ దేశంలో చూసినా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది.
RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు యథాతథం
అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ద్రవ్యోల్బణ సమస్య అంటే ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడమే.
ప్రపంచ దేశాలు ఈ ద్రవ్యోల్బణానికి బలవుతున్నాయి. ప్రపంచంలోనే అధికంగా వెనుజులాలో 318 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. లెబనాన్‌లో 215 శాతం, అర్జెంటీనాలో 143 శాతం, సిరియాలో 79.1 శాతం, పాకిస్థాన్‌లో 29.2 శాతం, ఇండియాలో 4.87 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్లు తెలుస్తోంది.