Finance Ministry: భారతదేశం అప్పు రూ.160.69 లక్షల కోట్లు!!
Sakshi Education
భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 డిసెంబర్ నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
గత సెప్టెంబర్ నాటికి రూ. 157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబర్ నాటికి మరింత పెరిగాయి. ఈ భారీ రుణభారంలో 25.9 శాతాన్ని రాబోయే ఐదేళ్లలో తీర్చాల్సి ఉంటుంది.
➤ 2023 డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం రుణభారం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 56.7 శాతానికి సమానం.
➤ రానున్న ఐదేళ్లలో (2024-29) రూ.41.24 లక్షల కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
➤ 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.7.12 లక్షల కోట్ల రుణం తీసుకోవాలని యోచిస్తోంది.
➤ 2023-24లో కేంద్ర ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
India's Transition: భారతదేశం.. కనీస వేతనం నుంచి జీవన వేతనానికి పరివర్తన
Published date : 30 Mar 2024 10:33AM