Skip to main content

WEF Global Gender Gap Report 2021: మహిళా సాధికారత 135.6ఏళ్లు దూరం

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (WEF) ‘ప్రపంచ లింగ అసమానత్వ నివేదిక (గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు)–2021’ను విడుదల చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎంతగా వెనుకబడ్డారన్న వివరాలను పొందుపర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, కానీ ఈ వేగం చాలదని డబ్ల్యూఈ ఎఫ్‌ స్పష్టం చేసింది. ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే.. మహిళలు పురుషులతో సమానంగా నిలిచేందుకు ఏకంగా 135.6 ఏళ్లు పడుతుందని పేర్కొంది.
 

un report

డబ్ల్యూఈఎఫ్‌ ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో మహిళల పరిస్థితిని పరిశీలించింది. ముఖ్యంగా నాలుగు అంశాల (ఉద్యోగ, ఉపాధి అవకాశాలు; విద్య; వైద్యం–ఆరోగ్యం; రాజకీయ సాధికారత)ను పరిగణనలోకి తీసుకుంది. వీటన్నింటినీ కలిపి ఒక శాతానికి స్కోర్‌ను నిర్ణయించింది. ఒకటి వస్తే మహిళల సాధికారత బాగున్నట్టు.. సున్నా స్కోర్‌ వస్తే మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టు లెక్కించారు. మొత్తం 156 దేశాలకుగాను భారతదేశం 0.62 స్కోర్‌తో 140వ స్థానంలో నిలిచినట్టు డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌ (65వ స్థానం), నేపాల్‌ (106), శ్రీలంక (16), భూటాన్‌ (130) మన దేశం కన్నా ముందుండగా.. పాకిస్తాన్‌ (153) వెనుక నిలిచింది. 2020 నివేదికలో మొత్తం 153 దేశాలకుగాను భారత్‌ 112వ స్థానంలో నిలవగా.. తర్వాతి ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 140వ స్థానానికి పడిపోయింది.

Also read: GK International Quiz:. ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను ప్రోత్సహించడానికి భారతదేశం ఎంత మొత్తాన్ని అందిస్తోంది?

Published date : 11 Jul 2022 07:36PM

Photo Stories