BPCL, Hero MotoCorp: బీపీసీఎల్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), టూ వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ జట్టు కట్టాయి. ‘మొదటి దశలో ఢిల్లీ, బెంగళూరుతో మొదలుపెట్టి తొమ్మిది నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత చార్జింగ్ స్టేషన్లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం‘ అని ఇరు సంస్థలు ఫిబ్రవరి 22న ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రణాళిక ప్రకారం రెండు సంస్థలు.. ముందుగా బీపీసీఎల్‌కు ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థకు సంబంధించి మిగతా అంశాల్లోనూ కలిసి పనిచేయనున్నాయి. బీపీసీఎల్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా అరుణ్ కుమార్ సింగ్ ఉన్నారు.
చదవండి: ఓషియన్ కనెక్ట్ మాల్దీవ్స్‌తో జత కట్టిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : టూ వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్
ఎందుకు : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్