Digital Payments: డిజిటల్ చెల్లింపులలో ఏపీ టాప్
ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.2,000 నుంచి రూ.2,200 వరకు ఉందని తెలిపింది.
ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత అత్యధికంగా డిజిటల్ చెల్లింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.1,800 నుంచి రూ.2,000 వరకు ఉంది. వీటి తర్వాత ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం, హరియాణాల్లో డిజిటల్ చెల్లింపుల పరిమాణం రూ.1,600 నుంచి రూ.1,800 వరకు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
GST on Online Games, Casinos: ఇకపై ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలకు 28 శాతం జీఎస్‌టీ
డిజిటల్ చెల్లింపుల్లో ఏపీ వాటా 8–12 శాతం
డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటా 8–12 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో జిల్లాల వారీగా యూపీఐ డిజిటల్ చెల్లింపుల పరిమాణం, విలువల్లో టాప్ 100 జిల్లాలే 45 శాతం వాటా కలిగి ఉన్నట్లు తేలింది. దేశ జీడీపీలో 2017లో ఏటీఎంల నుంచి 15.4 శాతం నగదు ఉపసంహరణలు జరగ్గా.. 2023లో 12.1 శాతానికి ఇవి తగ్గిపోయాయి. గతంలో ఒక వ్యక్తి ఏడాదిలో ఏటీఎంలకు 16 సార్లు వెళ్తే ఇప్పుడు 8 సార్లుకు పడిపోయింది.