Digital Payments: డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!
సాక్షి,ముంబై: డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా టాప్‌లో నిలిచింది. రికార్డు కలెక్షన్స్‌తో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2022 సంవత్సరంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో భారత దేశం ఐదు దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు మొత్తం నాలుగు దేశాల లావాదేవీలను కలిపిన దానికంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ వివరాలు మైగోవ్‌ఇండియా ట్విటర్‌లో షేర్ చేసింది.
ఈ డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో భారతదేశం గ్లోబల్ రియల్ టైమ్ చెల్లింపులలో 46 శాతం వాటాను సొంతం చేసుకుంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలు ఇతర నాలుగు ప్రముఖ దేశాలతో కలిపిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డిజిటల్ చెల్లింపు ల్యాండ్‌స్కేప్‌లో భారతదేశం ఆధిపత్యం కొనసాగిస్తోందని ట్వీట్ చేసింది.
ఈ జాబితాలో 29.2 మిలియన్లతో బ్రెజిల్ రెండో స్థానంలో, చైనా 17.6 మిలియన్ల లావాదేవీలతో మూడో స్థానంలోనూ నిలిచాయి. ఇక 16.5 మిలియన్లతో 4వ స్థానంలో థాయిలాండ్ ఉండగా, దక్షిణ కొరియా 8 మిలియన్ల లావాదేవీలతో అయిదో స్థానంలో ఉందని MyGovIndia డేటా పేర్కొంది.