Skip to main content

World Economic Forum: డబ్ల్యూఈఎఫ్‌ జాబితాలో 10 భారత కంపెనీలకు చోటు..

కృత్రిమ మేధస్సు (AI)లో వినూత్న ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్‌ కంపెనీల జాబితాను వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (WEF) విడుదల చేసింది.
10 Indian Startups Which Made Into WEF's Tech Pioneers List

డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్‌ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. డబ్ల్యూఈఎఫ్‌ రూపొందించిన జాబితాలో స్వచ్ఛ ఇంధనంపై ఆవిష్కరణలు చేసిన కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో వినూత్నంగా ఆలోచిస్తున్న సంస్థలు ఉన్నాయి.

హైదరాబాద్‌ సంస్థ నెక్ట్స్‌వేవ్‌..
తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన రాహుల్‌ అట్టులూరి, గుజ్జుల శశాంక్‌ రెడ్డి, అనుపమ్‌ ఏర్పాటు చేసిన నెక్ట్స్‌వేవ్‌ ఈ జాబితాలో స్థానం పొందింది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తోంది.

భారత్‌కు చెందిన కంపెనీలు ఇవే.. 
నెక్ట్స్‌వేవ్‌: చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తుంది.

నిరమాయ్‌: ఏఐ సహాయంతో ముందస్తు దశ రొమ్ము కేన్సర్‌ పరీక్షను అభివృద్ధి చేస్తుంది.

పిక్సెల్‌: జియో స్పేషియల్‌ డేటాను అందించే హైపర్‌స్పెక్ట్రల్‌ శాటిలైట్‌ ఇమేజినరీని అభివృద్ధి చేస్తుంది.

సర్వమ్‌ ఏఐ: భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడళ్లు, ప్లాట్‌ఫారాలను సిద్ధం చేస్తుంది.

యాంపియర్‌అవర్‌: పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను తయారుచేస్తుంది.

100 Metric Tonnes: భారత్‌కు 100 టన్నుల బంగారం.. ఎక్క‌డి నుంచి అంటే..

క్రాప్‌ఇన్‌: రైతులు తమ పొలాలకు జియో-టాగ్‌ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు పర్యవేక్షణ, నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తుంది.

హెల్త్‌ప్లిక్స్‌: ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డులను అభివృద్ధి చేస్తుంది.

ఇంటర్నేషనల్‌ బ్యాటరీ కంపెనీ (ఐబీసీ): రీఛార్జబుల్‌ ప్రిస్మాటిక్‌ లిథియం అయాన్‌ నికెల్‌ మాంగనీజ్‌ కోబాల్ట్‌ బ్యాటరీలను తయారు చేస్తుంది.

స్ట్రింగ్‌ బయో: విషవాయువుల నుంచి జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను తయారు చేస్తుంది.

Published date : 07 Jun 2024 05:42PM

Photo Stories