Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 27th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 27th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
G7 summit: జర్మనీలో జి–7 శిఖరాగ్ర భేటీ ప్రారంభం
G7 summit: జర్మనీలో జి–7 శిఖరాగ్ర భేటీ ప్రారంభం

G7 summit: జర్మనీలో జి–7 శిఖరాగ్ర భేటీ ప్రారంభం  

రష్యా, చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా జి–7 శిఖరాగ్ర సదస్సు  జూన్ 26న జర్మనీలోని బవేరియన్‌ ఆల్ప్స్‌లో ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల అధినేతలు పాలుపంచుకుంటున్నారు. బంగారం దిగుమతులపై నిషేధం సహా రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతులను భారీగా తగ్గించుకొనేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చలు సాగిస్తున్నారు.

Also read: Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 25th కరెంట్‌ అఫైర్స్‌

చైనా ప్రభావాన్ని అడ్డుకొనేందుకు ఉద్దేశించిన గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్‌ పార్ట్‌నర్‌షిప్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 7 దేశాలు కలిసి 2027 నాటికి 600 బిలియన్‌ డాలర్లు (రూ.46.95 లక్షల కోట్లు) సమీకరిస్తాయి. అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ నిధులను ఖర్చు చేస్తాయి. చైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరిట చిన్నదేశాలకు అప్పులిచ్చి, లాభపడుతున్న సంగతి తెలిసిందే. చైనాకు కౌంటర్‌గానే 600 బిలియన్‌ డాలర్ల నిధిని జి–7 దేశాలు తెరపైకి తీసుకొచ్చాయి. 

Also read: Presidential Election: ఎన్డీయే తరపున నామినేషన్‌ వేసిన ద్రౌపది ముర్ము

రష్యా బంగారం దిగుమతిపై నిషేధం! 
రష్యా నుంచి బంగారం దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని జి–7 దేశాలు భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ చర్య వల్ల ఆర్థికంగా ప్రపంచంలో రష్యా ఏకాకి అవుతుందన్నారు. చమురు తర్వాత రష్యా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యేది బంగారమే. 2020లో ప్రపంచం మొత్తం బంగారం ఎగుమతుల్లో రష్యా వాటా 5 శాతం. దీని విలువ 19 బిలియన్‌ డాలర్లు. దీనిలో 90 శాతం బంగారం జీ7 దేశాలకే వెళ్తోంది.       

Also read: Weekly Current Affairs (National) Bitbank: In which Northeast state first cow ambulance service has been started?
     
జీ-7 సమ్మిట్ హాజరైన ప్రధాని మోదీ
జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జూన్ 26న జర్మనీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకు మాతృక అని సగర్వంగా చాటుదాం’ అని పిలుపునిచ్చారు. ‘గత శతాబ్దంలో సంభవించిన మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అమెరికా, యూరప్‌ లబ్ధిపొందాయి. ఆ సమయంలో భారత్‌ దాస్య శృంఖలాల్లో ఉంంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్‌ నాయకత్వం వహిస్తోంది’ అని అన్నారు. భారతదేశం డిజిటల్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. నూతన సాంకేతికతను అద్భుతమైన రీతిలో ప్రజలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. 


World Archery Championship: ప్రపంచ ఆర్చరీలో ఏపీ అర్చర్ సురేఖకు స్వర్ణం 
 

WAC


పునరాగమనంలో భారత స్టార్‌ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పారిస్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నీలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించిన జంటగా నిలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ ద్వయం 152–149 పాయింట్ల తేడాతో (40–37, 36–38, 39–39, 37–35) సోఫీ డోడెమోంట్‌–జీన్‌ ఫిలిప్‌ (ఫ్రాన్స్‌) జోడీపై విజయం సాధించింది. ఒక్కో జంట నాలుగు బాణాల చొప్పున నాలుగుసార్లు లక్ష్యంపై గురి పెట్టాయి. తొలి సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించగా, రెండో సిరీస్‌లో ఫ్రాన్స్‌ జంట ఆధిక్యంలో నిలిచింది. మూడో సిరీస్‌లో రెండు జోడీలు సమంగా నిలువగా... నాలుగో సిరీస్‌లో మళ్లీ భారత జంట ఆధి క్యం సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.  


Also read: G7 summit: జర్మనీలో జి–7 శిఖరాగ్ర భేటీ ప్రారంభం

మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్‌ అనంతరం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలోనూ విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ రాణించింది. ముందుగా సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సురేఖ 147–145తో సోఫీ డోడెమోంట్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎల్లా గిబ్సన్‌ (బ్రిటన్‌)తో జరిగిన ఫైనల్లో సురేఖ ‘షూట్‌ ఆఫ్‌’లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్‌ ఇవ్వగా... గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే గిబ్సన్‌ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్‌కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి.

Also read: Sahitya Akademi Prize: సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

జూన్ 26న జరిగిన మహిళల టీమ్‌ రికర్వ్‌ ఫైనల్లో దీపిక కుమారి, అంకిత, సిమ్రన్‌ జిత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. చైనీస్‌ తైపీ జట్టుతో జరిగిన ఫైనల్లో దీపిక బృందం 1–5తో ఓడిపోయింది. 

ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం మూడు పతకాలు లభించాయి. 

Ranji Trophy Champions: తొలిసారి రంజీ టైటిల్ నెగ్గిన మధ్యప్రదేశ్‌ 

ranji trophy


కర్టాటర రాజధాని బెంగళూరులో జరిగిన రంజీ ట్రోఫీ - 2022 ఫైనల్లో ముంబైని ఓడించి మధ్య ప్రదేశ్ టైటిల్ గెలుచుకుంది.  41 సార్లు ట్రోఫీ సాధించిన ఘన చరిత్ర ఉన్న ముంబై జట్టుని ఓడించి.. రంజీ చరిత్రలో తొలిసారి కప్ గెలుచుకుంది. ఆఖరి రోజు దాకా సాగిన ఈ పోరులో మధ్యప్రదేశ్‌ ఆరు వికెట్ల తేడాతో మాజీ చాంపియన్‌ ముంబైని ఓడించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 113/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై 57.3 ఓవర్లలో 269 పరుగుల వద్ద ఆలౌటై మధ్యప్రదేశ్‌జట్టుకు 108 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్స్‌లో అర్మాన్‌ జాఫర్‌ (37) క్రితంరోజు స్కోరుకు మరో 7 పరుగులే జతచేసి అవుటయ్యాడు. సువేద్‌ పార్కర్‌ (51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత వచ్చిన వారిలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ సర్ఫరాజ్‌ ఖాన్‌ (45; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. కుమార్‌ కార్తీకేయ 4 వికెట్లు తీశాడు. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ 29.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హిమాన్షు మంత్రి (37; 3 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ శుభమ్‌ శర్మ (30; 1 ఫోర్, 1 సిక్స్‌), రజత్‌ పటిదార్‌ (30 నాటౌట్‌; 4 ఫోర్లు) రాణించారు. షమ్స్‌ ములానికి 3 వికెట్లు దక్కాయి. 

Also read: World Archery Championship: ప్రపంచ ఆర్చరీలో ఏపీ అర్చర్ సురేఖకు స్వర్ణం


TS Govt: సాగునీటి రంగ ప్రగతి నివేదిక విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 

TS agri


తెలంగాణ పచ్చబడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిరకాల కల సాకారమయ్యే క్రమంలో రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను దాటింది. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన సత్ఫలితాలిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతరీతిలో సాగునీటి వసతి కల్పనకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. రీడిజైనింగ్, రీ–ఇంజనీరింగ్‌ చేపట్టడంతో ప్రాజెక్టులన్నీ కొత్తరూపు సంతరించుకున్నాయి. దీంతో సాగునీటి విస్తీర్ణం పెరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల ప్రాజెక్టుల పూర్తితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. డిండి, గట్టు ఎత్తిపోతల, చనాఖా–కొరాటా ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరామ్‌సాగర్‌ వంటి ప్రాజెక్టుల కాల్వలను ఆధునీకరించింది. సాగునీటి రంగాభివృద్ధికి 8 ఏళ్లలో ఏకంగా రూ.1.52 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ ఆవిర్భవించి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రగతినివేదికలో ఈ విషయాలను పేర్కొంది.  

Also read: World Archery Championship: ప్రపంచ ఆర్చరీలో ఏపీ అర్చర్ సురేఖకు స్వర్ణం

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం ముందు తీరం నుంచి ఐదు దశలలో నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్‌ చేయాలన్న లక్ష్యంతో రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 70 శాతం పనులు పూర్తయ్యాయి.  6 జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో గల 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. 

Also read: GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు
గోదావరి నీటిని తరలించి భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. 

Also read: G7 summit: జర్మనీలో జి–7 శిఖరాగ్ర భేటీ ప్రారంభం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తులోకి లిఫ్టు చేసి రాష్ట్రంలో బీడువారిన భూములకు అందించడానికి ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిరి్మంచింది. కాళేశ్వరంలో భాగంగా గోదావరిపై మూడు బ్యారేజీలు, 20 భారీ లిఫ్టులు, 21 పంప్‌హౌస్‌లు, 18 రిజర్వాయర్లు, 1,832 కి.మీ. పొడవున సొరంగాలు, పైప్‌లైన్లు, కాల్వలతో కూడిన నెటవర్క్‌ను కేవలం 36 నెలల రికార్డు సమయంలో నిరి్మంచింది. ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగునీరందిస్తుంది. కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరంగా 100 టీఎంసీల జలాలను నిల్వ చేయవచ్చు.
 


Digital Agriculture Wing: తెలంగాణ వ్యవసాయ రంగంలో డిజిటల్‌ అగ్రికల్చర్‌ వింగ్‌

వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక విప్లవాన్ని తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా డిజిటల్‌ అగ్రికల్చర్‌ వింగ్‌ (డీఏడబ్ల్యూ– డా)ను ఏర్పాటు చేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రి టెక్‌ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను వ్యవస్థీకృతం చేయడంతో పాటు సమగ్ర విధానం కోసం ఇతర కార్య క్రమాలను చేపట్టడంపై ఈ డిజిటల్‌ అగ్రి కల్చర్‌ వింగ్‌ దృష్టి సారిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే సమగ్ర, సుస్థిర సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగంలో సమూల మార్పుల కోసం ఈ విభాగం పనిచేస్తుంది.  దేశంలోనే తొలిసారిగా ఈ తరహా వింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

Also read: TS Govt: సాగునీటి రంగ ప్రగతి నివేదిక విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

త్వరలో ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌
ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఎంపిక చేసిన ఆవిష్కరణలతో ప్రత్యేక ప్రద ర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోం ది. ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయి సమస్యలకు కనుగొనే పరిష్కారాలకు సంబం ధించిన ఆవిష్క రణలను ఎంపిక చేసే ప్రక్రియకు ఇన్నో వేషన్‌సెల్‌ శ్రీకారం చుట్టింది. ఆవిష్కర్తలు తమ పేరు, వయసు, గ్రామం, వంటి వివరాలతో పాటు ఆవిష్కరణ వివరాలు, ఫొటోలు, రెండు నిమిషాల వీడియోను 9100678543 నంబరుకు వాట్సాప్‌లో పంపాలని సెల్‌ సూచించింది. ఆగస్టు 5లోగా ఆవిష్కరణల వివరాలు పంపాలి.

Also read: AP CM YS Jagan: రైతన్న ఖాతాల్లో.. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా..


Floating Solar Project: కేరళలో తేలియాడే భారీ సోలార్‌ ప్రాజెక్ట్‌ సిద్ధం 
 

solar systemదేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కార్యరూపంలోకి వచ్చింది. టాటా గ్రూప్‌ కంపెనీ అయిన టాటా పవర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ ఈ ప్రాజెక్టును కేరళలోని కాయంకుళం వద్ద 350 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో గరిష్టంగా 101.6 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. తరచూ మార్పు చెందే నీటి మట్టాలు, తీవ్రమైన సముద్ర అలల తాకిడి, నీటి లవణీయత వంటి సవాళ్లున్నా నిర్ణీత వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసినట్టు కంపెనీ ప్రకటించింది.  

Also read: Digital Agriculture Wing: తెలంగాణ వ్యవసాయ రంగంలో డిజిటల్‌ అగ్రికల్చర్‌ వింగ్‌


Aquatics Championship: తెలంగాణ స్విమ్మర్‌ శివానికి స్వర్ణం

Telangana swimmer shivani


జాతీయ సబ్‌ జూనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ శివాని కర్రా మూడు పతకాలతో మెరిసింది. గుజరాత్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల శివాని అండర్‌–11 బాలికల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించింది. శివాని 34.93 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఫైనల్‌ రేసును శివాని 1ని:14.81 సెకన్లలో ముగించి రజత పతకం గెలిచింది. అనంతరం 4X50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలేలో శివాని, అన్నిక దెబోరా, మేఘన నాయర్, వేములపల్లి దిత్యా చౌదరీలతో కూడిన తెలంగాణ బృందం 2 నిమిషాల 12.31 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గచ్చిబౌలిలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) స్విమ్మింగ్‌పూల్‌లో కోచ్‌ ఆయుశ్‌ యాదవ్‌ వద్ద గత ఐదేళ్లుగా శివాని శిక్షణ తీసుకుంటోంది.

Also read: GK Persons Quiz: ఈ సంవత్సరం జ్యూరీ సభ్యురాలిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనబోయే భారతీయ నటి?

Published date : 27 Jun 2022 06:08PM

Photo Stories