Skip to main content

AP CM YS Jagan: రైతన్న ఖాతాల్లో.. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా..

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 14వ తేదీ (మంగళవారం) వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.
ysr free crop insurance
YSR Free Crop Insurance

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2021 ఖరీఫ్‌లో పంటనష్టపోయిన 15.61 లక్షలమంది రైతులకు రూ.2,977.72 కోట్లు ఇస్తున్నామన్నారు.

ఇంకా ఏమన్నారంటే..
‘‘ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రైతులకు బీమా కింద రూ.885 కోట్లు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ పాలనలో మార్పును గమనించాలని కోరుతున్నాం. ఇంతకు ముందు బీమా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి. ఒక సీజన్‌లో నష్టం జరిగితే.. మళ్లీ మరుసటి ఏడాది అదే సీజన్‌ రాకముందే నేరుగా రైతుల చేతుల్లో పెడుతున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పంటల బీమా పరిహారాన్ని చెల్లిస్తున్నాం. పారదర్శకంగా ప్రతిరైతన్న కుటుంబానికీ మంచి జరుగుతోంది. పంట నష్టపోతే, రైతు నష్టపోతే రాష్ట్రం నష్టపోతుంది. అందుకే పంటల బీమా విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గడచిన మూడేళ్లుగా రైతులకు పంట నష్టం విషయంలో ఈ ప్రభుత్వం తోడుగా నిలబడింది.

గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం.. తేడా గమనించండి...
గత ప్రభుత్వం పాలనలో అక్షరాల ఐదేళ్ల కాలానికి పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3411 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీ బిడ్డ పాలనలో మూడేళ్ల కాలంలో అక్షరాల 44.28లక్షల మంది రైతులకు ఉచితంగా పంటల బీమా చేయించి రూ.6.685 కోట్లు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించమని కోరుతున్నాను. గత ప్రభుత్వం పెట్టిన రూ.715.84 కోట్ల రూపాయల పంటల బీమా బకాయిలను కూడా మీ బిడ్డ ప్రభుత్వం చెల్లించింది. పంటల బీమాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయిలు పెడితే.. ఈ ప్రభుత్వం ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని.. మళ్లీ అదే సీజన్‌ వచ్చేలోగా పెడుతున్నారు. రైతన్నలకు మేలు చేసే విషయంలో మనం గత పాలకులతో కాదు పోటీపడేది.. దేశంతో పోటీపడుతున్నాం. మన గ్రామాల్లో ఆర్బీకేలను చూసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వస్తున్నారు. ఆర్బీకేల ద్వారా వస్తున్న మార్పులను చూస్తున్నారు. మూడేళ్లుగా మన పాలనలో వచ్చిన మార్పులను చూడండి

ఎప్పుడూ చూడని విధంగా..
గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైఎస్సార్‌ రైతుభరోసా, పీఎం కిసాన్‌ కింద రూ.23,875కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే నేరుగా రైతన్నల చేతుల్లో పెట్టాం. జూన్‌ మాసం రాకముందే.. వ్యవసాయ పనులు రాకముందే... రైతు భరోసా సొమ్మును నేరుగా రైతన్నల ఖాతాల్లో వేశాం. మూడేళ్లలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రైతుల కోసం మీ బిడ్డ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ.1,27,823 కోట్లు. పంటల బీమాకు మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇ-క్రాపింగ్‌ చేయించి ప్రతి రైతన్నకు పారదర్శకంగా చెల్లింపులు చేస్తున్నాం. సీజన్‌లో నష్టం జరిగితే.. సీజన్‌ ముగియకముందే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. రైతులకు సున్నావడ్డీకింద రూ.1283 కోట్లు చెల్లించాం మూడేళ్లలో. గత ప్రభుత్వంలో ఐదేళ్లకాలంలో సున్నావడ్డీ కింద చెల్లించింది కేవలం రూ.782 కోట్లు. ఆర్బీకేలు రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాయి.

ప‌గ‌టి ఉచిత విద్యుత్ కోసం..
పగటి పూటే 9 గంటలపాటు రైతన్నలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. దీని కోసమే ఫీడర్లకోసం రూ.1700 కోట్లు పెట్టాం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 8,845 కోట్ల ఉచిత విద్యుత్‌ బకాయిలను చెల్లించాం. ధాన్యం చెల్లింపులకోసం గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయిలు పెడితే దాన్ని చెల్లించాం. విత్తనాల కొనుగోలు కోసం బకాయిలు పెట్టిన రూ. 384 కోట్ల డబ్బునుకూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దురదృష్టవశాత్తూ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్న కుటుంబానికి రూ.7 లక్షల వెంటనే ఇస్తున్నాం. కౌలు రైతు ఆత్మహత్య దురదృష్టవశాత్తు చేసుకుంటే వెంటనే ప్రభుత్వం ఆదుకుంటుంది

ప్రపంచంలోనే 8వ స్థానంలో..
ధాన్యం కొనుగోలు కోసం మూడేళ్లలో దాదాపు రూ.45వేల కోట్లు ఖర్చు చేశాం. గ‌త ప్ర‌భుత్వ ఐదేళ్లలో రూ.30-32వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్‌ను తీసుకు వచ్చాం. ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అవినీతి లేకుండా, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. ఒక్కపైసా కూడా అవినీతి లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా మీ చేతికే వస్తోంది. గతంలో ఇది ఎందుకు జరగలేదు? అప్పుడు నేరుగా గత పాలకుల చేతుల్లోకి డబ్బులు పోయేవి. గతంలో జరగనిది.. ఇప్పుడు మీ బిడ్డ పాలనలో జరుగుతుంది.

Published date : 14 Jun 2022 06:43PM

Photo Stories