Sahitya Akademi Prize: కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన రచయిత్రి?
Telugu Current Affairs - Awards: రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం(Sahitya Akademi Prize for Translation) లభించింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ రచించిన అదృశ్య భారత్(నాన్ ఫిక్షన్) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్’ పేరిట తెలుగులోకి అనువదించారు. దేశంలోని పారిశుధ్య కార్మికుల వాస్తవ జీవన చిత్రాన్ని అశుద్ధ భారత్ పుస్తకం ఆవిష్కరించింది. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాంబర్ నేతృత్వంలోని కార్యనిర్వాహక బోర్డు జూన్ 24న సమావేశమై 22 పుస్తకాలను సాహిత్య అకాడమీ అనువాద అవార్డులకు ఎంపిక చేసింది. జనవరి 1, 2015 నుంచి డిసెంబరు 2019 మధ్య ప్రచురితమైన పుస్తకాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.
GK National Quiz: ప్రధాని నరేంద్ర మోదీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
నలుగురికి భాషా సమ్మాన్ అవార్డు: అకాడమీ కార్యనిర్వాహక బోర్డు 2019కిగానూ నాలుగు రీజియన్ల భాషా సమ్మాన్ అవార్డులను ప్రకటించింది. సంప్రదాయ, మధ్యయుగ సాహిత్యంపై చేసిన కృషికిగానూ ప్రొఫెసర్ దయానంద్(ఉత్తరం) ఎ.దక్షిణామూర్తి (దక్షిణం), సత్యేంద్ర నారాయణ్ గోస్వామి(తూర్పు), మహమ్మద్ అజం (పశ్చిమ)లను ఎంపిక చేసినట్లు పేర్కొంది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.
Pulitzer Prizes 2022: పులిట్జర్ అవార్డుకు ఎంపికైన భారతీయ ఫోటో జర్నలిస్టు?GK Awards Quiz:‘‘నాట్ జస్ట్ క్రికెట్: ఎ రిపోర్టర్స్ జర్నీ’’ పుస్తక రచయిత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 సంవత్సరానికిగానూ కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన రచయిత్రి?
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయ
ఎందుకు : ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ రచించిన అదృశ్య భారత్(నాన్ ఫిక్షన్) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్’ పేరిట తెలుగులోకి..
FAO: ఛాంపియన్ అవార్డుకు భారత్ నుంచి నామినేట్ అయిన వ్యవస్థ?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్