Skip to main content

FAO: ఛాంపియన్‌ అవార్డుకు భారత్‌ నుంచి నామినేట్‌ అయిన వ్యవస్థ?

YSR Rythu Bharosa Centres

విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో).. అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్‌’’ అవార్డుకు మన దేశం తరపున ఆర్బీకే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది.

GK International Quiz: ఇన్‌స్టాగ్రామ్ ఇకపై ఏ దేశంలో అందుబాటులో ఉండదు?

‘ఆహార భద్రత – 2030’ లక్ష్యం..
ప్రపంచవ్యాప్తంగా మానవాళి చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా ‘ఆహార భద్రత – 2030’ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఎఫ్‌ఏవో కృషి చేస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య దేశాలకు వివిధ రూపాల్లో చేయూతనిస్తోంది. అంతర్జాతీయంగా అగ్రి ఫుడ్‌ వ్యవస్థలను మార్చడం లేదా మార్పు కోసం స్థిరమైన అభివృద్ధి అజెండాతో పనిచేసే సంస్థలు, ప్రభుత్వాలను ఏటా ఛాంపియన్‌ అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కింద 50 వేల యూఎస్‌ డాలర్లను అందజేస్తారు.

ఛాంపియన్‌ అవార్డు – విశేషాలు..

  • ప్రతిష్టాత్మక ఛాంపియన్‌ అవార్డు కోసం ఎఫ్‌ఎవో అంతర్జాతీయంగా నామినేషన్లను ఆహ్వానించింది. 
  • ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్‌ ఆర్బీకేలను రోల్‌ మోడల్‌గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మన దేశం తరపున ఈ అవార్డు కోసం ఎఫ్‌ఏవోకు నామినేట్‌ చేసింది. 
  • అందరికీ సుస్థిర ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో అనుసరిస్తున్న వినూత్న విధానాలు, వ్యవస్థలు, వాటి ద్వారా వచ్చిన మార్పులు, ఉత్పత్తి, పోషకాహారం, పర్యావరణం, జీవన విధానాల్లో సాధించిన మెరుగైన ఫలితాలు లాంటి అంశాలను అవార్డుకు ప్రామాణికంగా తీసుకుంటారు. 
  • వివిధ దేశాల నుంచి అందిన నామినేషన్లను వివిధ దశల్లో వడపోస్తారు. చివరిగా అంశాల వారీగా అర్హత కలిగిన సంస్థలు, ప్రభుత్వాలను ఐరాస అత్యున్నత కౌన్సిల్‌ ఎంపిక చేస్తుంది.
  • జూన్‌ 13 నుంచి 17వతేదీ వరకు ఐక్యరాజ్య సమితిలో జరిగే ఎఫ్‌ఏవో 169వ కౌన్సిల్‌ సమావేశంలో డైరెక్టర్‌ జనరల్‌ చేతుల మీదుగా ఎంపికైన సంస్థలు / ప్రభుత్వాలకు ఛాంపియన్‌ అవార్డును ప్రదానం చేస్తారు.

రైతు భరోసా కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించారు?
2020, మే 30వ తేదీన రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా వ్యవసాయ సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నుంచి పంట అమ్మకం వరకు సూచనలు, సలహాలు అందిస్తాయి. పంటరుణాలు, ఇన్య్సూరెన్స్, గిట్టుబాటు ధరలు కల్పించేలా పనిచేస్తాయి.Lata Mangeshkar: లతా దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ అవార్డు తొలి గ్రహీత ఎవరు?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో).. అందించే ‘‘ఛాంపియన్‌’’ అవార్డుకు భారత్‌ తరపున ఆర్బీకే వ్యవస్థ సిఫారసు
ఎప్పుడు : మే 1 
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా వ్యవసాయ సేవలు అందిస్తున్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 May 2022 04:55PM

Photo Stories