Skip to main content

Lata Mangeshkar: లతా దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ అవార్డు తొలి గ్రహీత ఎవరు?

PM Modi

ప్రముఖ నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ స్మృత్యర్థం ఏర్పాటైన ‘‘లతా దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ అవార్డు’’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. దీంతో లత మరణానంతరం ఆమె పేరిట నెలకొల్పిన ఈ అవార్డు తొలిగ్రహీతగా మోదీ నిలిచారు. ఏప్రిల్‌ 24న లత తండ్రి వర్ధంతి సందర్భంగా అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ముంబైలో ఈ కార్యక్రమం జరిగింది. ఇకపై ప్రతి ఏటా దేశానికి ఎనలేని సేవలనందించినవారికి ఈ అవార్డు నందిస్తామని దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ స్మృతి ప్రతిష్ఠాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రకటించింది.

Telugu Vedic Scholar: భారతాత్మ పురస్కార్‌ను ఎవరు అందుకున్నారు?

డిజిటల్‌ లావాదేవీలు.. రోజుకు రూ. 20వేల కోట్లు
దేశంలో రోజుకు రూ. 20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లవాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్‌ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటివల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఏప్రిల్‌ 24న ఆయన మన్‌ కీ బాత్‌లో ఈ మేరకు ప్రసంగించారు.​​​​​​​GK Economy Quiz: భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్నది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లతా దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ అవార్డు తొలి అవార్డు ప్రదానం
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు    : దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ స్మృతి ప్రతిష్ఠాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశానికి సేవలనందించినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 25 Apr 2022 05:07PM

Photo Stories