Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 6, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 6th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 6th 2023 Current Affairs

Swachh Sujal Shakti Samman Award: ముఖరా(కె) సర్పంచ్‌కు ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్’
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షి ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్–2023’ అవార్డును అందుకున్నారు. మార్చి 4న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ్ భారత్ గ్రామీణ్ విభాగంలో కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీనాక్షికి ఈ అవార్డును అందించారు. 220 ఇళ్లు ఉన్న ముఖరా(కె) గ్రామం ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో చోటుదక్కించుకుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తమ గ్రామాభివృద్ధి వివరాలను మీనాక్షి వివరించారు.

Caste Discrimination: కులవివక్షను నిషేధించిన సియాటిల్‌

Moon: భూమికి క్రమంగా దూరమవుతున్న చంద్రుడు.. ఏటా ఎంత దూరం జరుగుతున్నాడంటే?
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. భూమ్మీద రోజు నిడివి ఎంతుండేదో తెలుసా? ఇప్పుడున్న దాంట్లో దాదాపు సగమే! సరిగ్గా చెప్పాలంటే 13 గంటల కంటే కాస్త తక్కువ!! అప్పట్నుంచీ అది క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉందట! చంద్రుడు క్రమంగా భూమికి దూరంగా జరుగుతుండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు తేల్చారు!!
భూమికి చంద్రుడు దూరంగా జరుగుతున్న తీరును శాస్త్ర పరిభాషలో ల్యూనార్ రిసెషన్గా పిలుస్తారు. ఇది ఎంతన్నది అపోలో మిషన్లలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లు ఇటీవల దీన్ని కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు భూమికి ఏటా 3.8 సెంటీమీటర్ల మేరకు దూరంగా జరుగుతున్నట్టు తేల్చారు. అందువల్లే భూమిపై రోజు నిడివి అత్యంత స్వల్ప పరిమాణంలో పెరుగుతూ వస్తోందట. మహాసముద్రాలతో, అలలతో చంద్రుని సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్ లండన్ రాయల్ హోలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్టాం చెబుతున్నారు.

Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!

ఆయన భూమి, చంద్రుని మధ్య సంబంధంపై చిరకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ‘‘ఇటు భూమి, అటు చంద్రుడు ఎవరి కక్ష్యలో వారు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ వల్ల మహాసముద్రాల్లో ఆటుపోట్లు (అలల్లో హెచ్చు, తగ్గులు) సంభవిస్తూ ఉంటాయి. సదు అలల ఒత్తిడి భూ భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్ప పరిమాణంలో తగ్గిస్తుంటుంది. అలా తగ్గిన శక్తిని చంద్రుడు తన కోణీయ గతి కారణంగా గ్రహిస్తుంటాడు. తద్వారా చంద్రుడు నిరంతరం హెచ్చు కక్ష్యలోకి మారుతూ ఉంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడన్నమాట’’ అని ఆయన వివరించారు. 
అప్పట్లో రోజుకు రెండు సూర్యోదయాలు
‘‘అప్పట్లో, అంటే ఓ 350 కోట్ల ఏళ్ల క్రితం ఇప్పటి రోజు నిడివిలో ఏకంగా రెండేసి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరిగేవి! ఎందుకంటే రోజుకు 12 గంటలకు అటూ ఇటుగా మాత్రమే ఉండేవి. ఈ నిడివి క్రమంగా పెరుగుతూ వచ్చింది, వస్తోంది’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్ షిల్లర్ యూనివర్సిటీ జెనాలో జియోఫిజిసిస్టుగా చేస్తున్న టామ్ ఈలెన్ఫెల్డ్ వివరించారు.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి ఏడాది పూర్తి


Andrey Botikov: స్పుత్నిక్–5 టీకా సృష్టించిన సైంటిస్టు హత్య 
రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్–5 సృష్టికర్తల్లో ఒకరైన అగ్రశ్రేణి శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ (47) హత్యకు గురయ్యారు. మాస్కోలోని అపార్టుమెంట్లోనే మార్చి 2వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు బెల్టుతో గొంతు నులిమి చంపారు. గమలెయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మేథమేటిక్స్లో సీనియర్ పరిశోధకుడిగా ఉన్నారు. ఇక్కడే మరో 18 మంది శాస్త్రవేత్తలతో కలిసి 2020లో స్పుత్నిక్ వీ టీకాను రూపొందించారు. హత్యకు పాల్పడిన 29 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ దర్యాప్తు కమిటీ మార్చి 4న వెల్లడించింది. ఆండ్రీ బొటికోవ్తో చిన్న విషయమై తలెత్తిన తగాదాతోనే ఈ నేరానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడని కూడా తెలిపింది. నిందితుడికి నేర చరిత్ర ఉందని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎన్నదగిన పరిశోధనలు జరిపిన వైరాలజిస్ట్ ఆండ్రీ బొటికోవ్ను 2021లో అధ్యక్షుడు పుతిన్ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్లాండ్’పురస్కారంతో సత్కరించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Bill Gates: ప్రగతి పథంలో భారత్.. బిల్‌గేట్స్ 
ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం తదితర రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కుబేరుడు, భూరి దాత బిల్ గేట్స్ పొగిడారు. భారత ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను కేటాయిస్తే భవిష్యత్తులో భారత్ మరింతగా సర్వతోముఖాభివృద్ధిని సాధించగలదన్నారు. ‘సురక్షిత, ప్రభావవంతమైన, అందుబాటు ధరలో వందలకోట్ల వ్యాక్సిన్ డోస్లు తయారుచేసే సత్తాను భారత్ సాధించడం గొప్ప విషయం. కోవిడ్ విపత్తు కాలంలో కోవిడ్ టీకాలను అందించి ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవితాలను భారత్ కాపాడగలిగింది. పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఇతర వ్యాక్సిన్లనూ సరఫరాచేసింది. ‘మార్చి 3న ప్రధాని మోదీని కలిశాను. సుస్థిర జగతి కోసం ఆయన చేస్తున్న కృషి కనిపిస్తోంది. సృజనాత్మకతో నిండిన భారత్లో పర్యటించడం ఎంతో ప్రేరణ కల్గిస్తోంది’ అని బిల్గేట్స్ ట్వీట్ చేశారు. 
‘కోవిడ్ సంక్షోభ కాలంలో 30 కోట్ల మందికి భారత్ అత్యవసర డిజిటల్ చెల్లింపులు చేసింది. సమ్మిళిత ఆర్థికవ్యవస్థకు పెద్దపీట వేసింది. 16 కేంద్ర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గతి శక్తి కార్యక్రమం ద్వారా రైల్వే, జాతీయరహదారులు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షిస్తూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో క్రియాశీలకంగా పనిచేయించడం డిజిటల్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. కో–విన్, ఆధార్ సహా పలు కీలక ఆవిష్కరణలతో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం భారత్కు జీ20 సారథ్య రూపంలో వచ్చింది. తృణధాన్యాలపై అవగాహన కోసం తీసుకుంటున్న చొరవ, చిరుధాన్యాల ఆహారం అమోఘం’’ అని గేట్స్ అన్నారు.


Elections 2023: గృహిణులకు నెలకు రూ.2 వేలు

Global Investors Summit: ఏపీలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు 
ఆంధ్రప్రదేశ్లోని అపారమైన అవకాశాలను వివరిస్తూ ‘అడ్వాంటేజ్ ఏపీ’పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ హిట్ అయ్యింది. దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు చేసుకున్నారు. రెండు రోజుల సమావేశాలకు రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు కరణ్ అదానీ, జిందాల్, భంగర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎంరావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతా రెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి, మషాహిరో యమాగుచి, టెస్లా కోఫౌండర్ మార్టిన్ ఎబర్హార్డ్ వంటి 30కిపైగా కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. అంబానీ మొదలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకోవడమే కాకుండా అందులో భాగస్వామ్యమవుతామంటూ ప్రకటించారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో 20 రంగాల నుంచి రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 378 ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా 6,09,868 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Female Population: ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య.. ప్ర‌తి వెయ్యి మంది అబ్బాయిలకు ఎంత మంది అమ్మాయిలున్నారంటే..?


Ladli Behna Yojana: మహిళల కోసం ‘లాడ్లి బెహనా’ యోజన 
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటించింది. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రి ‘లాడ్లి బెహనా యోజన’ఫలకాన్ని ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. పథకం కింద ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్తుంది. ఇందుకు అర్హులుగా.. ఆదాయ పన్ను చెల్లించని, వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండే వారు, తదితర కేటగిరీలను నిర్ణయించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి కలుగనుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.8 వేల కోట్లను కేటాయించారు. మార్చి 15–ఏప్రిల్‌ 30 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

Brahmos Missile: బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం 
బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని భారతీయ నావికా దళం మార్చి 5న‌ విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ – డీఆర్‌డీఓ  దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్‌ లాంచ్డ్‌ వెర్షన్‌ను అరేబియా సముద్రంలో పరీక్షించారు. భారత్‌–రష్యా సంయుక్త భాగస్వామ్య బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ జలాంతర్గాములు, విమానాలు, ఓడలతోపాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్‌ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. బ్రహ్మోస్‌ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని భారత్‌ ఎగుమతి కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణి యాంటీ షిప్‌ వెర్షన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

North Korea: ఉత్తర కొరియాలో ఆకలి కేకలు 
చుక్కలు చూపిస్తున్న‌ సరుకుల ధరలు.. కిలో బియ్యం రూ.220 
పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది ఉత్తర కొరియా పరిస్థితి. అధ్యక్షుడు కిమ్‌ వరుస క్షిపణి పరీక్షలతో దాయాది దక్షిణ కొరియాకు, దాని మద్దతుదారు అమెరికాకు సవాళ్లు విసురుతుంటే దేశం మాత్రం కనీవినీ ఎరుగని కరువు కోరల్లో చిక్కి అల్లాడుతోంది. తిండికి లేక జనం అలమటిస్తున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగకుంటే 1990ల్లో దేశం చవిచూసిన 20 లక్షల పై చిలుకు ఆకలి చావుల రికార్డు చెరిగిపోయేందుకు ఎంతోకాలం పట్టదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది..!       
అటు కాలం కనికరించడం లేదు. తీవ్ర వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గతేడాది పంట దిగుబడులు కుదేలయ్యాయి. ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతో ఇంతో ఆదుకుంటూ వచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇంతకాలం మార్కెట్లో దొరుకుతూ వచ్చిన చైనా తిండి గింజలు, నిత్యావసరాలు కరోనా కట్టడి దెబ్బకు మూడేళ్లుగా అసలే అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఉత్తర కొరియా అక్షరాలా ఆకలి కేకలు పెడుతోంది. జనాభాలో అధిక శాతం రోజుకు ఒక్క పూట కూడా తిండికి లేక అలమటిస్తున్నారు. నియంతృత్వపు ఇనుప తెరలు దాటుకుని ఏ విషయమూ బయటికి రాదు గనుక అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే లక్షలాది మంది కరువు బారిన పడ్డట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరువు మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు చె బుతున్నాయి. అస్తవ్యస్త పాలనకు మారుపేరైన కిమ్‌ ప్రభుత్వమే ఇందుకు ప్రధాన దోషిగా కనిపిస్తోంది. 

Fifth Layer of Earth: భూమికి ఐదో పొరను కనిపెట్టిన శాస్త్రవేత్తలు
కారణాలెన్నో.. 
☛ కొరియా కరువుకు చాలా కారణాలున్నాయి. కరోనా దెబ్బకు ఆహార కొరత తీవ్రతరమైంది. 
☛ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలను విధించి అత్యంత కఠినంగా అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత పెరిగింది. 2.5 కోట్ల జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి కనీసం 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కాగా వార్షిక సగటు ఉత్పత్తి 45 లక్షల టన్నులే. మిగతా 10 శాతం లోటు చాలావరకు చైనాతో సాగే అనధికారిక వర్తకం ద్వారా పూడేది. తిండి గింజలు, నిత్యావసరాలతో పాటు పలు ఇతర చైనా సరుకులు 2020 దాకా దేశంలోకి భారీగా వచ్చేవి. ముఖ్యంగా గ్రామీణుల అవసరాలు చాలావరకు వీటిద్వారానే తీరేవి. కానీ మూడేళ్లుగా ఆంక్షల దెబ్బకు ఈ వర్తకం దాదాపుగా పడకేసింది. ఇది సగటు కొరియన్లకు చావుదెబ్బగా మారింది. దీనికి తోడు గతేడాది తిండి గింజల ఉత్పత్తి 35 లక్షల టన్నులకు మించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Irani Cup 2023: ఇరానీ కప్‌ విజేత రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా 
ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు 30వ సారి ఇరానీ కప్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. రంజీ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌ జట్టుతో మార్చి 5న‌ ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో మయాంక్‌ అగర్వాల్ కెప్టెన్సీలోని రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు 238 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 437 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 81/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ ఆట చివరిరోజు మరో 117 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 

Axis Bank: ఇక‌పై 120 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందిస్తున్న‌ ఆ బ్యాంక్ క‌నిపించ‌దు..

Verstappen: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి చాంప్‌ వెర్‌స్టాపెన్‌  
ఫార్ములావన్‌ సీజన్‌లోని తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. వెర్‌స్టాపెన్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 33 నిమిషాల 56.736 సెకన్లలో ముగించి టైటిల్‌ సాధించాడు. పెరెజ్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, అలోన్సో (ఆస్టన్‌ మారి్టన్‌) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి మార్చి 19న జరుగుతుంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

 

 
 

Published date : 06 Mar 2023 06:20PM

Photo Stories