Daily Current Affairs in Telugu: 18 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్ధులకు ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీలు హార్వర్డ్, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ కోర్సుల సర్టిఫికేషన్ కోసం ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
2. భారత నౌకాదళం కోసం దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ‘వింధ్యగిరి’ని ఆగస్టు 17న కోల్‌కతాలోని హుగ్లీ తీరంలో ఉన్న గార్డెన్ రీచ్ షిప్‌యార్డులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జలప్రవేశం చేయించారు.
3. చంద్రయాన్-3లో ఆగస్టు 17న ప్రోపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.
Daily Current Affairs in Telugu: 17 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మలిక్ స్వర్ణ పతకం సాధించింది.
5. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్, తుషార్ ప్రభాకర్ షెల్కేలతో కూడిన భారత పురుషుల జట్టు, మహిళల టీమ్ రికర్వ్ మ్యాచ్‌లో అంకిత, భజన్ కౌర్, సిమ్రన్‌జిత్ కౌర్ కాంస్య పతకాలు సాధించారు.
6. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో శివా నర్వాల్ (579), సరబ్‌జోత్ సింగ్ (578), అర్జున్ సింగ్ (577)లతో కూడిన భారత జట్టుకు కాంస్య పతకం లభించింది.
7. జాతీయ సబ్ జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి కర్రా శివాని రెండు బంగారు పతకాలు సాధించింది.
Daily Current Affairs in Telugu: 16 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్