Big Breaking: త్వరలో విశాఖ నుంచే పరిపాలన..: సీఎం వైఎస్ జగన్
తొలిరోజు 92 ఎంవోయూలు రాగా మొత్తం 340 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాం.. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఏపీలో కీలక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చాము.
చదవండి: అతిథులకు పసందైన రుచులతో విందు
రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలం. పెట్టుబడులకే కాదు.. ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పోర్టులకు సమీపంలో పుషల్కంగా భూములు ఉన్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్ ఉంటే అందులో 3 ఏపీలోనే ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్ వన్‌గా ఉన్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నాము. అలాగే, త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌గా రాజధానిగా అవుతుంది. త్వరలో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఒక్క ఫోన్ కాల్‌తో సమస్యలు పరిష్కరిస్తాము. భవిష్యతులో గ్రీన్, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర అని అన్నారు.