Sadarem certificate: దివ్యాంగులకు గుడ్ న్యూస్... సదరం స్లాట్ బుకింగ్‌లు ప్రారంభం ఎప్పటినుంచంటే...
Sakshi Education
సదరం సర్టిఫికెట్లు పొందేందుకు స్లాట్ బుకింగ్‌లు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్‌లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో 171 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్‌టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి శాశ్వత ధ్రువీకరణ పత్రాలిస్తారు.
గతంలో ఏ జిల్లాకు చెందినవారు ఆ జిల్లాలోని ఆస్పత్రుల్లోనే స్లాట్ బుక్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరుకావాల్సి ఉండేది. ఈ క్రమంలో విద్య, ఉపాధి, కుటుంబ అవసరాల నిమిత్తం సొంత జిల్లాలను విడిచి వేరే జిల్లాల్లో నివసించేవారు సదరం సర్టీ ఫికెట్ పొందేందుకు సొంత జిల్లాకు వెళ్లాల్సి వచ్చేది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా సదరం స్క్రీనింగ్‌కు హాజరై సర్టీ ఫికెట్ పొందేందుకు ప్రభుత్వం గతేడాది జూలై నుంచి అవకాశం క ల్పించింది.
చదవండి: ఇలా చేస్తే ఆధార్ ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు
చదవండి: బ్యాంకుల్లో పేరుకుపోయిన 35 వేల కోట్లు...
Published date : 07 Apr 2023 05:47PM