Skip to main content

Anil Chauhan : నూత‌న‌ సీడీఎస్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనీల్‌ చౌహాన్‌.. ఈయ‌న 40 ఏళ్ల కెరీర్‌లో..

జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణానంతరం సుమారు 9 నెలల తర్వాత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌)ను నియమించింది కేంద్ర ప్రభుత్వం.

బిపిన్‌ రావత్‌ తర్వాత సీడీఎస్‌గా లెఫ్టినెట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌(రిటైర్ట్‌) పేరును కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ ప్రకటించింది. 

CDS General Bipin Rawat: రాష్ట్రంలోని స్కూల్‌కు జనరల్‌ రావత్‌ పేరు పెట్టారు?

లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌహాన్‌ 2021, మే నెలలో తూర్పు కమాండ్‌ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. దాదాపు తన 40 ఏళ్ల కెరీర్‌లో అనిల్ చౌహాన్ సైన్యంలోని అనేక హోదాల్లో పనిచేశారు. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు కార్యకలాపాలను నిరోధించడంలో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. సైన్యంలో పలు ఉన్నత పదవులను నిర్వర్తించారు చౌహాన్‌.

Chopper Crash: ఎంఐ–17వీ5 ప్రమాదంపై దర్యాప్తును ఎవరి నేతృత్వంలో నిర్వ‌హించారు?

NEW CDS

త్రివిద దళాలను ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ తొలి సీడీఎస్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2020, జనవరిలో బాధ్యతలు చేపట్టారు.అయితే.. 2021 డిసెంబర్‌లో తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మిలిటరీ హెలికాప్టర్‌లో వెళుతుండగా ప్రమాదం జరిగి రావత్‌, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో 11 మంది మరణించారు. అప్పటి నుంచి సీడీఎస్‌ పోస్ట్‌ ఖాళీగానే ఉంది. దాదాపు 9 నెలల తర్వాత కొత్త సీడీఎస్‌ను నియమించింది కేంద్రం.

Chief of Defense Staff: జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఏ రాష్ట్రంలో జన్మించారు?

Published date : 28 Sep 2022 07:50PM

Photo Stories