Budget Effect: ఏప్రిల్ నుంచి షాక్‌లే షాక్‌లు... భారీగా పెరగనున్న వాహనాల ధరలు... భారీగా టోల్ మోత.. ఇంకా
భారీగా పెరిగేవి ఇవే...
ప్రైవేటు జెట్స్, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ప్లాటినం, ఇమిటేషన్ ఆభరణాలు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, సిగరెట్లు.
చదవండి: ఏప్రిల్ నుంచి మారనున్న పన్ను విధానం... పన్ను చెల్లింపుదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే...
కొంత ఉపశమనం కలిగించేవి ఇవే....
దుస్తులు, వజ్రాలు, రంగు రాళ్లు, బొమ్మలు, సైకిళ్లు, టీవీలు, ఇంగువ, కాఫీ గింజలు, శీతలీకరించిన నత్తగుల్లలు, మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, కెమెరా లెన్స్‌లు, భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీలు మొదలైనవి తగ్గే జాబితాలో ఉన్నాయి.
స్టాండర్డ్ డిడక్షన్‌లో....
పాత పన్ను విధానంలో ఉద్యోగులకు అందించిన రూ. 50000 స్టాండర్డ్ డిడక్షన్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు రూ. 52,500 ప్రయోజనం పొందుతారు .
చదవండి: వందలో 20 వడ్డీలకే పోతోంది.. పెట్రోల్ సబ్సిడీలో కోత.. పూర్తి విశ్లేషణ
రోడ్డు ఎక్కితే బాదుడే...
జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ఈసారి 5 నుంచి 10 శాతం మేర టోల్ చార్జీలు పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు.
ఆభరణాలకు హాల్‌మార్కింగ్...
ఏప్రిల్ 1 నుంచి పసిడి ఆభరణాలను 6 అంకెల హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్)తో విక్రయించడం తప్పనిసరని.. ఈ గడువును పొడిగేంచేది లేదని బీఐఎస్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ తివారీ ఇప్పటికే స్పష్టం చేశారు.
వాహనాలు మరింత ఖరీదు..
ఏప్రిల్ 1 నుంచి కొన్ని కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలో మారుతీ, హీరోమోటోకార్ప్ సహా పలు కంపెనీలు ఉన్నాయి.
చదవండి: ఆర్థిక వృద్ధికి నిర్మలమ్మ కొత్త సూత్రం.. పొదుపు కాదు.. ఖర్చు చేయండి!