Global Investors Summit: ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్ వన్
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ సారధ్యంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది.
చదవండి: అన్ని దారులు వైజాగ్ వైపే... సమ్మిట్ కు పారిశ్రామిక దిగ్గజాల క్యూ
ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్ ఇండస్ట్రీపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోంది.