Skip to main content

PM Modi Europe visit: డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌తో ప్రధాని మోదీ ఎక్కడ సమావేశమయ్యారు?

PM Modi - Denmark PM

డెన్మార్క్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. మే 3న డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌ వేదికగా జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం సహా అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్‌ పర్యావరణ విధ్వంసకారి కాదని, భూ పరిరక్షణ యత్నాల్లో ముందంజలో ఉంటుందని చెప్పారు. ‘‘2070 నాటికి కర్బన ఉద్గారరహిత దేశంగా రూపొందేందుకు ప్రయత్నిస్తున్నాం. 2030 నాటికి దేశ ఇంధనావసరాల్లో 40 శాతం పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఫ్రెడెరిక్సన్‌కు వివరించారు. రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభానికి.. చర్చలతో తెరదించాలని వ్యాఖ్యానించారు.

GK International Quiz: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి వైదొలుగుతామని బెదిరించినది?

రాణి మార్గరెథే 2తో సమావేశం..
ప్రధాని మోదీకి డెన్మార్క్‌లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని ఫ్రెడెరిక్సన్‌ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. డెనార్క్‌లో పర్యటించిడం ప్రధాని మోదీకి ఇదే తొలిసారి. మే 4న కూడా ఆయన డెన్మార్క్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డెన్మార్క్‌ రాణి మార్గరెథే 2తో సమావేశమవుతారు. అక్కడి భారతీయులతో కలిసి ఇండో డెన్మార్క్‌ రౌండ్‌టేబుల్‌ వ్యాపార సమావేశంలో పాల్గొంటారు. డెన్మార్క్‌లో 60కి పైగా భారత కంపెనీలున్నాయి. 16వేల దాకా ప్రవాస భారతీయులున్నారు.

ఇండో నార్డిక్‌ సమావేశం
రెండో ఇండియా నార్డిక్‌ సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. నార్డిక్‌ దేశాలైన డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, స్వీడన్, నార్వే ప్రధానులు ఈ సమావేశానికి హాజరవుతారు. 2018లో జరిగిన తొలి ఇండో నార్డిక్‌ సదస్సు అనంతరం పురోగతిని సమీక్షిస్తారు. ఆర్థిక రికవరీ, శీతోష్ణస్థితి మార్పు, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధన వనరులు, అంతర్జాతీయ భద్రత, ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఇండో నార్డిక్‌ సహకారం తదితరాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. నార్డిక్‌ ప్రధానులతో మోదీ విడిగా కూడా చర్చిస్తారు. నార్డిక్‌ దేశాలు, భారత్‌ మధ్య 2020–21లో 500 కోట్ల డాలర్లకు పైగా వాణిజ్యం జరిగింది. ​​​​​​​PM Modi Europe visit: జర్మనీ చాన్సలర్‌ షొల్జ్‌తో ప్రధాని మోదీ ఎక్కడ సమావేశమయ్యారు?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :
డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌తో సమావేశం
ఎప్పుడు : మే 03
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : కోపెన్‌హాగన్, డెన్మార్క్‌
ఎందుకు : ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం సహా అనేక అంశాలపై చర్చించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 May 2022 03:03PM

Photo Stories