PM Modi Europe visit: జర్మనీ చాన్సలర్ షొల్జ్‌తో ప్రధాని మోదీ ఎక్కడ సమావేశమయ్యారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన ప్రారంభమయ్యింది. ఆయన మే 2న జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌కు చేరుకున్నారు. మోదీకి జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షొల్జ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ, షొల్జ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్–జర్మనీ నడుమ వ్యాపార–వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 2021 డిసెంబర్‌లో జర్మనీ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన షొల్జ్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే మొదటిసారి. వ్యూహాత్మక, స్థానిక అంతర్జాతీయ పరిణామాలను సమీక్షించారు.
GK National Quiz: పిల్లల కోసం పిల్లల బడ్జెట్‌ను సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం?
అటవీ విస్తీర్ణం పెంపుకు సహకారం..
మోదీ, షొల్జ్ భేటీ సందర్భంగా భారత్–జర్మనీ మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఆ వివరాలు ఇలా..
- పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవటానికి సంబంధించిన సంయుక్త ప్రకటనపై భారత్, జర్మనీలు సంతకాలు చేశాయి. అటవీ విస్తీర్ణం పెంపులో సహకారానికి ఉద్దేశించిన ఈ అవగాహనపై రెండు దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు వర్చువల్ విధానంలో ఆమోదం తెలిపారు.
- 2030 నాటికి సాధించాల్సిన పర్యావరణ లక్ష్యాల కోసం భారత్‌కు సుమారు రూ.80,430 కోట్ల(1000 కోట్ల యూరోలు) మేర సహాయాన్ని అదనంగా అందజేయనున్నట్లు జర్మనీ తెలిపింది. ఈ మొత్తాల్లో 50 శాతం నిధులను పునరుత్పాదక ఇంధనాలకు కేటాయిస్తారు.
- వ్యవసాయ–పర్యావరణం, ప్రకృతి వనరుల సుస్థిర నిర్వహణకు సంబంధించి సుమారు రూ.2412 కోట్ల(30 కోట్ల యూరోలు) మేర రుణాలను రాయితీతో భారత్‌కు అందించే ఒప్పందంపైనా ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఆరో ఐజీసీలో..
- ప్రతినిధుల స్థాయి చర్చల్లోనూ మోదీ, షొల్జ్ పాల్గొన్నారు. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా భాగస్వాములయ్యారు.
- తర్వాత ఆరో భారత్–జర్మనీ ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో మోదీ, షొల్జ్ పాలుపంచుకున్నారు. భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు. రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన సంబంధ బాంధవ్యాలకు ఈ భేటీ నిదర్శనమని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది.
- భారత్–జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆరో ఐజీసీ బలోపేతం చేస్తాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
జీ–7 సదస్సు ఏ దేశంలో జరగనుంది?
భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షమే వహిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో విజేతలెవరూ ఉండరన్నారు. యుద్ధంలో మునిగినవారికి నష్టం తప్ప లాభం ఉండదన్నారు. బెర్లిన్‌లో జర్మనీ చాన్సలర్ షొల్జ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. జర్మనీ వేదికగా జూన్ 26 నుంచి 28 వరకు జరగబోయే జీ7 సదస్సు–2022కు మోదీని ఆహ్వానించానని షొల్ చెప్పారు.
జర్మనీ విదేశాంగ మంత్రితో జై శంకర్ భేటీ
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మే 2న బెర్లిన్‌లో జర్మనీ విదేశాంగ మంత్రి బెయిర్‌బాక్‌తో విడిగా సమావేశమయ్యారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇండో–పసిఫిక్ పరిణామాలతోపాటు భారత్–జర్మనీ మధ్య ద్వైపాకిక్ష సహకారంపై చర్చించారు.
ప్రధాని మోదీ జర్మనీలో ఎన్నిసార్లు పర్యటించారు?
ప్రధాని మోదీకి బెర్లిన్‌లో బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. జర్మనీలో 2.03 లక్షల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు ఉన్నట్లు అంచనా. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వా త జర్మనీలో పర్యటించడం ఇది ఐదోసారి. గతంలో 2015 ఏప్రిల్, 2017 మే, 2017 జూలై, 2018 ఏప్రిల్‌లో జర్మనీలో పర్యటించారు. ప్రధాని మోదీ మే 3న డెన్మార్క్‌లో, మే 4న ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. అనంతరం భారత్‌కు చేరుకుంటారు.
European Commission: ప్రధాని మోదీతో ఈసీ చీఫ్ ఉర్సులా ఎక్కడ భేటీ అయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షొల్జ్ సమావేశం
ఎప్పుడు : మే 02
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : బెర్లిన్, జర్మనీ
ఎందుకు : భారత్–జర్మనీ నడుమ వ్యాపార–వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్