Gujarat: సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్ ప్రధాని?
ఇంగ్లండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం ఏప్రిల్ 21న భారత్‌కు వచ్చారు. ఇంగ్లండ్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టులో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు సంప్రదాయ గుజరాతీ నృత్యాలు, సంగీతంతో బోరిస్‌కు స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని(గాంధీ ఆశ్రమం) బోరిస్ సందర్శించారు. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఇక్కడి హృదయ్‌కుంజ్‌లో బోరిస్ చరఖా తిప్పారు. ఆశ్రమం నిర్వాహకులు ఆయనకు చరఖాను బహూకరించారు. మహాత్మాగాంధీ అసాధారణ నాయకుడని బోరిస్ జాన్సన్ ఈ సందర్భంగా కొనియాడారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొట్టమొదటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ రికార్డుకెక్కారు.
Economic Crisis in Sri Lanka: శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్ సరఫరా చేసిన దేశం?
జేసీబీ ఫ్యాక్టరీ ప్రారంభం
- బోరిస్ జాన్సన్ ఏప్రిల్ 21న గుజరాత్‌లోని పంచమహల్స్ జిల్లా హలోల్‌లో నూతన జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించారు.
- గుజరాత్ రాజధాని గాంధీనగర్ సమీపంలో కొత్తగా నిర్మించిన గుజరాత్ బయోటెక్ యూనివర్సిటీ(జీబీయూ) క్యాంపస్‌ను ఆయన తిలకించారు.
- గాంధీనగర్‌లో ప్రఖ్యాత అక్షరధామ్ ఆలయాన్ని బోరిస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు.
- అహ్మదాబాద్‌లో బోరిస్ జాన్సన్‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సమావేశమయ్యారు.
GK Economy Quiz: భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్నది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్ ప్రధాని?
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : ఇంగ్లండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్
ఎందుకు : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్