Padma Awards: పీవీ సింధుకు పద్మభూషణ్ పురస్కారం
కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రభవన్‌లో జరిగింది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను 2021, నవంబర్ 8న ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గ్రహీతలకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగా.. ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు.
చదవండి: బుకర్ ప్రైజ్-2021 విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా రచయిత?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్