Booker Prize 2021: బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా రచయిత?
దక్షిణాఫ్రికా రచయిత డామన్ గల్గుట్‌ను ఆంగ్ల సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ‘బుకర్ ప్రైజ్’ వరించింది. డామన్ రచించిన ‘‘ది ప్రామిస్’’ నవలకు గాను 2021 ఏడాది బుకర్ ప్రైజ్ లభించింది. ఈ మేరకు నవంబర్ 3న ప్రకటన వెలువడింది. బుకర్ ప్రైజ్ విజేతకు 50వేల పౌండ్ల(దాదాపు రూ. 50 లక్షలకుపైగా) నగదును అందిస్తారు. ది ప్రామిస్ నవల దక్షిణాఫ్రికా జాత్యహంకార చరిత్రతో ఒక శ్వేతజాతి కుటుంబం గురించి వివరిస్తుంది. ఒక శ్వేతజాతి మహిళ... నల్లజాతికి చెందిన పనిమనిషికి ఆమె సొంత ఇల్లు ఇస్తానని చేసిన ప్రామీస్ చుట్టూ ఈ కథ ఉంటుంది.
చదవండి: మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుకర్ ప్రైజ్–2021 విజేత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : దక్షిణాఫ్రికా రచయిత డామన్ గల్గుట్
ఎందుకు : ‘‘ది ప్రామిస్’’ నవలను రచించినందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్