Skip to main content

India’s Most Innovative Sustainability Project of the year Award: శ్రీసిటీకి ఇండియాస్‌ మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు

దేశంలోని ప్రముఖ వ్యాపార ప్రచురణ సంస్థ, వ్యాపార రంగంలో లోతైన విశ్లేషణకు ప్రసిద్ధి చెందిన బిజినెస్‌ వరల్డ్‌ నిర్వహించిన సస్టైనబుల్‌ వరల్డ్‌ కాన్‌క్లేవ్‌ అండ్‌ అవార్డ్స్‌ ఐదో ఎడిషన్‌లో ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును శ్రీసిటీ సొంతం చేసుకుంది.
Innovative Sustainability Project: Sricity,Business World Recognizes Sricity for Sustainability,  India's Top Sustainability Project: Sricity, Sri City wins India’s Most Innovative Sustainability Project of the year Award

ముంబైలో జరిగిన కార్యక్రమంలో బిజినెస్‌ వరల్డ్‌ చైర్మన్‌ అండ్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ డాక్టర్‌ అనురాగ్‌ బాత్రా నుంచి శ్రీసిటీ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) సతీశ్‌ కామత్‌ అవార్డు అందుకున్నారు. సుస్థిర ప్రమాణాలను గుర్తించే ప్రతిష్టాత్మక వేదికైన సస్టైనబుల్‌ వరల్డ్‌ కాంక్లేవ్‌ అండ్‌ అవార్డ్స్‌... శ్రీసిటీ చేపడుతున్న సుస్థిరమైన పట్టణీకరణ అభివృద్ధి చర్యలను గుర్తించింది. ఈ రంగంలో నిపుణులు, పరిశ్రమ లీడర్‌లతో కూడిన అత్యున్నత న్యాయనిర్ణేతలతో కఠినమైన మూల్యాంకన ప్రక్రియ ద్వారా ఈ అవార్డుకు విజేతలను ఎంపిక చేశారు.

New investments in AP: పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రపథంలో ఏపీ

Published date : 23 Nov 2023 06:00PM

Photo Stories