Padma Awards: పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి
Sakshi Education
ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి, వారి గొప్పదనం, విజయాలు పద్మ అవార్డులతో సత్కరించడానికి అర్హులను భావించినట్లయితే ఆ పేర్లను సిఫారసు చేయాలని ప్రజలను సోమవారం కేంద్రం కోరింది.
2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లు, ప్రతిపాదలను 2023 మే ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపింది.
పద్మ అవార్డుల సిఫారసులకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 15. ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో https://awards.gov.in ద్వారా పంపాలని కోరింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవిస్తుంది.
చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల
చదవండి: మే అంతా పరీక్షా కాలం.. 7 పరీక్షలు ఈ నెలలోనే... రూల్స్ మార్చేసిన టీఎస్‌పీఎస్‌సీ
Published date : 03 May 2023 04:08PM