94th Academy Awards: ఆస్కార్ ఫైనల్‌కు నామినేట్ అయిన భారతీయ చిత్రం?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 94వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ ఫిబ్రవరి 8న వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనకు హోస్ట్స్‌గా వ్యవహరించారు. ఈ నామినేషన్స్‌లో ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రం ఏకంగా 12 నామినేషన్లు దక్కించుకోగా, ‘డ్యూన్’ చిత్రం 10, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘బెల్‌ఫాస్ట్’ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్లు లభించాయి. 2022, మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే.
భారత్ నుంచి..
భారత్ నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌మేకర్స్ రిటు థామస్, సుస్మిత్ ఘోష్ తీసిన ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే పదిహేనుకు పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.
జై భీమ్, మరక్కర్ సినిమాలకు నిరాశ..
బెస్ట్ ‘ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ కన్సిడరేషన్ ఫర్ 94 ఆస్కార్ అవార్డ్స్’ అంటూ కొన్ని రోజుల క్రితం నామినేషన్ ఎంట్రీ పోటీలో ఆస్కార్ ఆకాడమీ ప్రకటించిన 276 చిత్రాల్లో తమిళ ‘జై భీమ్’, మలయాళ ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’ చిత్రాలు చోటు దక్కించుకోగలిగాయి. కానీ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో మాత్రం ఈ చిత్రాలకు నిరాశ తప్పలేదు.
మొత్తం 23 విభాగాలు..
మొత్తం 23 విభాగాలకు సంబంధించిన నామినేషన్లను అవార్డు కమిటీ ప్రకటించింది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, నటి, నటీమణి నామినేషన్లు ఈ విధంగా...
- ఉత్తమ చిత్రం: బెల్ ఫాస్ట్, కోడా, డోన్ట్ లాకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజా, నైట్‌మేర్ అల్లీ. ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ
- ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), పాల్ థామస్ ఆండ్రూసన్ (లికోరైస్ పిజ్జా), స్టీవెన్ స్పీల్‌బర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ), ర్యూసుకీ హమగుచి (డ్రైవ్ మై కార్), కెన్నెత్ బ్రానాగ్ (బెల్‌ఫాస్ట్)
- ఉత్తమ నటుడు: ఆండ్రూ గార్‌ఫీల్డ్ (టిక్, టిక్ ... బూమ్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), డెంజిల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మెక్‌బెత్), జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ది రికార్డోస్)
- ఉత్తమ నటి: నికోల్ కిడ్‌మెన్ (బీయింగ్ ది రికార్డోస్), ఓలీవియా కోల్మన్ (ది లాస్ట్ డాటర్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), జెస్సికా కాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ), పెనెలోప్ క్రజ్ (సమాంతర తల్లులు)
అత్యధిక వయసు ఉన్న నటిగా..
- దర్శకురాలు జేన్ కాంపియన్ రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేటయ్యారు. ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు సంబంధించి ఉత్తమ దర్శకురాలు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నారు. ఈ ఫీట్ సాధించిన తొలి మహిళ కాంపియనే.
- డేమ్ జూడీ డెంచ్ (87) ‘బెల్ ఫాస్ట్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా నామినేషన్ దక్కించుకున్నారు. ఆస్కార్ చరిత్రలో నామినేషన్ దక్కించుకున్న అత్యధిక వయసు ఉన్న నటిగా జ్యూడీ డెంచ్ చరిత్ర సృష్టించారు.
- తాజాగా కెన్నెత్ బ్రానాగ్ దర్శకత్వం వహించిన ‘బెల్‌ఫాస్ట్’కి బెస్ట్ పిక్చర్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్ దక్కింది. దీంతో ఏడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. కెన్నెత్ ఇంతకుముందు డైరెక్టర్, యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, లైవ్ యాక్షన్, షార్ట్ ఫిలిం విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్నారు.
చదవండి: పరమ విశిష్ట సేవా పతకానికి ఎంపికైన క్రీడాకారుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 94వ ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన భారతీయ చిత్రం?
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : రైటింగ్ విత్ ఫైర్
ఎక్కడ : బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్