73rd Republic Day: పరమ విశిష్ట సేవా పతకానికి ఎంపికైన క్రీడాకారుడు?
టోక్యో ఒలింపిక్స్–2020లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం నీరజ్ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకానికి ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన మొత్తం 384 మంది రక్షణ సిబ్బందికి గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులను జనవరి 25న ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులలో 12 శౌర్య చక్ర, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు ఉన్నాయి.
టోక్యో ఒలింపిక్స్–2020 జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. దీంతో భారత్‌కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్ చరిత్రలోకెక్కాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో అభివన్ బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. నీరజ్ 2021 ఏడాదిలోనే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. ఇక ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా నీరజ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: శౌర్యచక్ర అవార్డుకు ఎంపికైన అమర జవాను?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరమ విశిష్ట సేవా పతకానికి ఎంపికైన క్రీడాకారుడు?
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
ఎందుకు : ఆర్మీలో సుబేదార్‌గా ఉత్తమ సేవలందించిన..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్