Skip to main content

National Awards: హస్తకళాకారులకు జాతీయ అవార్డులు

భారతీయ హస్త కళలు, టైక్స్‌టైల్స్‌ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి కేంద్రం అవార్డులు అందజేసింది. న‌వంబ‌ర్ 28న‌ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసినట్లు టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వశాఖ తెలిపింది.

2017, 2018, 2019లో జాతీయ అవార్డులకు మొత్తం 78 మంది హస్త కళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2018కి తెలంగాణ నుంచి కరీంనగర్‌కు చెందిన గద్దె అశోక్‌కుమార్‌ (సిల్వర్‌ ఫిలిగ్రీ)కి, ఏపీ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాలవాయి కుళాయప్ప (లెదర్‌ పప్పెట్రీ, 2017), డి.శివమ్మ (లెదర్‌ పప్పెట్రీ, 2019)లకు అవార్డు అందజేసినట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపింది. అలాగే, 2017, 2018, 2019 సంవత్సరాలకు మొత్తం 30 మంది శిల్పగురులను ఎంపిక చేయగా ఏపీ నుంచి బ్లాక్‌ మేకింగ్‌లో కొండ్ర గంగాధర్‌ (2018), కలంకారిలో వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి (2019)ను ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరికి బంగారు నాణెం, రూ.2 లక్షల నగదు, తామ్రపత్రం, శాలువా, ప్రశంసాపత్రం అందజేసినట్లు తెలిపింది. 

14 మంది ప్రధానుల్లో 9 మంది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచే.. ఎన్ని రోజులు అధికారంలో ఉన్నారంటే...
 

Published date : 29 Nov 2022 04:17PM

Photo Stories