Skip to main content

Mahsa Amini awarded Sakharov human rights prize: మహ్సా అమినికి సఖరోవ్‌ పురస్కారం

గత ఏడాది ఇరాన్‌ పోలీస్‌ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్‌–ఇరాన్‌ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్‌ యూనియన్‌ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది.
Mahsa Amini awarded Sakharov human rights prize,European Union Human Rights Prize Winner: Mahsa Amini
Mahsa Amini awarded Sakharov human rights prize

మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సఖరోవ్‌ పురస్కారాన్ని యూరోపియన్‌ యూనియన్‌ ఏటా ప్రకటిస్తోంది. డిసెంబర్‌ 13న జరిగే కార్యక్రమంలో మహ్సా అమిని కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్‌ ధరించలేదనే కారణంతో మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Satyajit Ray Lifetime Achievement Award: హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ డగ్లస్‌కు సత్యజిత్‌ రే అవార్డు

కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్‌ 16న మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యేనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణచివేసింది. గత ఏడాది సఖరోవ్‌ పురస్కారాన్ని రష్యా దురాక్రమ ణను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియెట్‌ యూనియన్‌ అసమ్మతి వాది ఆండ్రీ సఖరోవ్‌ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న సఖరోవ్‌ 1989లో మరణించారు.

Nobel Prize 2023 Winners List: నోబెల్ బహుమతి-2023 విజేతల పూర్తి జాబితా ఇదే...

Published date : 20 Oct 2023 03:08PM

Photo Stories