Jayadheer Tirumala Rao: ఆద్యకళ బృందానికి అరుదైన గౌరవం
Sakshi Education
ఆదివాసీ, గిరిజన జానపద వస్తు సముదాయానికి అరుదైన గౌరవం లభించింది.
కొన్ని వందల ఏళ్లుగా విస్మరణకు గురైన గిరిజన సంస్కృతి, చరిత్ర తాలూకు అమూల్యమైన ఆనవాళ్లను ఆద్యకళ ద్వారా జనబాహుళ్యంలోకి తెచ్చిన ఆచార్య జయదీర్ తిరుమలరావు, సమన్వయకర్త ఆచార్య గూడూరు మనోజకు ఫ్రాన్స్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది. ఇండో–యూరోపియన్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఫ్రాన్స్‌లోని నాంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో ‘భారత్, ఆఫ్రికా మానవీయ శాస్త్రాల సంభాషణ’అనే అంశంపై ఈ నెల 13 నుంచి 16 వరకు జరగనున్న సదస్సులో వీరు పాల్గొననున్నారు. ఆద్యకళపై జరిగిన పరిశోధన, కళాఖండాల సేకరణపై ప్రసంగించనున్నారు.
National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
Published date : 02 Dec 2022 12:53PM