Skip to main content

IIM Visakhapatnam: వైజాగ్ ఐఐఎంకు పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అవార్డు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం (ఐఐఎంవీ) మరో అరుదైన అవార్డు దక్కించుకుంది.
Award Ceremony at Dr. BR Ambedkar Convention Center, Award Presentation at International PR Festival-2023, International Public Relations Festival-2023 Award Ceremony, IIM Visakhapatnam Received the prestigious PRSI award, IIMV Award Announcement at PR Festival 2023,
IIM Visakhapatnam Received the prestigious PRSI award

 న్యూఢిల్లీలోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఫెస్టివల్‌–2023లో ఐఐఎంవీకు అవార్డు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ స్టార్టప్‌లకు చేయూతనందిస్తున్నందుకు గాను పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అందించిన ప్రతిష్ఠాత్మక అవార్డును ఐఐఎంవీ ప్రతినిధి ఎంఎస్‌ సుబ్రహ్మణ్యం అందుకున్నారు.

India’s Most Innovative Sustainability Project of the year Award: శ్రీసిటీకి ఇండియాస్‌ మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ది ఇయర్

ఐఐఎంవీలో మహిళా స్టార్టప్స్‌ని ప్రోత్సహించేందుకు ఐఐఎంవీ ఫీల్డ్‌(ఇంక్యుబేషన్‌ అండ్‌ స్టార్టప్స్‌)ను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి బ్యాచ్‌లో  20 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాగించిన విజయాలకు సంబంధించిన వివరాలతో ‘బ్రేకింగ్‌ బౌండరీస్‌’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం ప్రీమియర్‌ బిజినెస్‌ స్కూల్‌ అవార్డును సొంతం చేసుకుంది.

Corrosion Awareness Awards 2023: ఏపీ నిట్‌ ఆచార్యుడుకి కొరోషన్‌ అవేర్‌నెస్‌ అవార్డు

Published date : 27 Nov 2023 01:30PM

Photo Stories