Skip to main content

Best Novel Award: కొంగవాలు కత్తి నవలను ఎవరు రచించారు?

Telugu University

తెలుగు సాహిత్యంలో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 ఏడాదికి సాహితీ పురస్కారాలను 2021, అక్టోబర్ 21న ప్రకటించింది. ఈ అవార్డుల్లో ‘కొంగవాలు కత్తి’ ఉత్తమ నవలా పురస్కారం దక్కింది. గడ్డం మోహన్‌రావు రాసిన కొంగవాలు కత్తికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార్-2019 లభించిన విషయం విదితమే. అక్టోబర్‌  29 తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన అవార్డుల వివరాలు ఇలా...

  • పద్య కవితా ప్రక్రియలో మొవ్వ వృషాద్రిపతి రచన (శ్రీ కృష్ణదేవరాయ విజయ ప్రబంధము)
  • వచన కవితా ప్రక్రియలో కాంచనపల్లి గోవర్ధన్రాజు (కల ఇంకా మిగిలే ఉంది)
  • బాల సాహిత్యంలో సామలేటి లింగమూర్తి (పాటల పల్లకి)
  • కథానికా ప్రక్రియలో రావుల పాటి సీతారాంరావు (ఖాకీకలం)
  • నవలా ప్రక్రియలో డాక్టర్గడ్డం మోహన్రావు (కొంగవాలు కత్తి)
  • సాహిత్య విమర్శలో డాక్టర్కిన్నెర శ్రీదేవి (సీమకథ అస్తిత్వం)
  • నాటకం/నాటికల్లో ఎన్‌.ఎస్‌.నారాయణబాబు (అశ్శరభ శరభ)
  • అనువాదంలో కె.సజయ ( శుద్ధ భారత్‌)
  • వచన రచనల విభాగంలో లక్ష్మణరావు పతంగే (హైదరాబాద్నుండి తెలంగాణ దాక)
  • రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగం లో సమ్మెట ఉమాదేవి (రేలపూలు)

 

 

చ‌ద‌వండి: ఈయూ మానవ హక్కుల పురస్కారానికి ఎంపికైన వ్యక్తి?

డౌన్‌లోడ్‌ చేసుకోండి:

తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...

డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Oct 2021 04:50PM

Photo Stories