Sakharov Prize: ఈయూ మానవ హక్కుల పురస్కారానికి ఎంపికైన వ్యక్తి?
జైలు జీవితం గడుపుతున్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని యురోపియన్ యూనియన్(ఈయూ) అత్యున్నత పురస్కారం వరించింది. మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సఖరోవ్ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారాన్ని నావల్నీకి ప్రకటించారు. ఈ బహుమతి కింద ఆయనకు 50,000 యూరోలు (దాదాపు రూ.43.59 లక్షలు) అందజేయనున్నారు. మానవహక్కులపై నావల్నీ రాజీ లేని పోరాటం చేస్తున్నారని ఈయూ తెలిపింది. ‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవినీతి చర్యలపై సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇతర రూపాల్లో నావల్నీ నిరంతర ప్రచారం చేశారు. అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలో ప్రజల మద్దతు సమీకరించారు.’ అని పేర్కొంది.
చదవండి: క్లారివేట్ అవార్డును అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సఖరోవ్ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారానికి అలెక్సీ నావల్నీ ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : యురోపియన్ యూనియన్(ఈయూ)
ఎందుకు : మానవహక్కులపై రాజీలేని పోరాటం చేస్తున్నందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్